పక్కదారి పట్టించే పనిలో వైకాపా...!

పక్కదారి పట్టించే పనిలో వైకాపా...!

కోట్ల రూపాయల అవినీతి కేసును పక్కదారి పట్టించడానికి పక్కాగా ప్రణాళిక రచిస్తోంది జగన్ పార్టీ.తమకు ఏ మాత్రం అనుకూల పరిణామాలు లేని నేపథ్యంలో, పార్టీ అధినేత భవిష్యత్తు అగమ్య గోచరం అయిన పరిణామాల మధ్య జగన్ పార్టీ కొత్త డ్రామాలను నడపడానికి ప్లాన్ చేసింది. ఇప్పుడు జగన్ కేసు విషయంలో జగన్ పార్టీ వాదన కేవలం బెయిలు గురించి మాత్రమే! జగన్ నేరం చేశాడా, అవినీతి జరిగిందా , లేదా అనేవి పాయింట్లే కాదు... కేవలం జగన్ కు బెయిలు రావడం లేదు కాబట్టి ఈ కేసే సరైంది కాదు..అని జగన్ పార్టీ వాదన.

గొబెల్స్ రీతిలో పదే పదే ఈ విషయాన్ని ప్రచారం చేయడానికి వైఎస్సార్పీపీ పూనుకుంది. పార్టీ పాదయాత్రికురాలు షర్మిల కానీ, ఇప్పుడిప్పుడే రంగంలోకి దిగిన వైఎస్ భారతి రెడ్డి కానీ... కేవలం తమ జగన్ కు బెయిలు రాకపోవడం సీబీఐ, కేంద్ర ప్రభుత్వాల కుట్ర ఉందని అంటున్నారు.అసలు ఈ కేసులో జగన్ కుట్ర గురించి మాట్లాడటం లేదు. వారు నడిచిన దారిలోనే పార్టీ కూడా నడవబోతోంది. ఇకపై 'జగన్ కు బెయిలు దొరకకపోవడం' అనే అంశం గురించి జగన్ పార్టీ జిల్లా స్థాయిల్లో ప్రత్యేక చర్చా కార్యక్రమాలు నిర్వహించనుందట. ఈ కార్యక్రమాల్లో ఆయా జిల్లా స్థాయిల్లోని అపరమేధావులను పిలిపించి, జగన్ కు బెయిలు రాకపోవడంలో కేంద్ర ప్రభుత్వం, సీబీల కుట్ర ఉందని తేల్చి చెప్పడానికి సర్వం సిద్ధం చేస్తోంది.

అయితే ఇది పార్టీ పేరు గా కాకుండా...జగన్ కు జరుగుతున్న అన్యాయంపై సమాజం స్పందిస్తున్నట్టుగా నిర్వహించాలనేది మరో ప్లాను! పార్టీ తరపున ఈ కార్యక్రమం నిర్వహిస్తే, అది పార్టీ కార్యక్రమం మాత్రమే అవుతుంది. అందుకని మధ్య వర్తుల ద్వారా, తమకు అనుకూలమైన వ్యక్తుల ద్వారా జగన్ పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తోంది. ఎలాగూ సొంత మీడియా ఉండనే ఉంది కాబట్టి..ఈ కార్యక్రమానికి మరింత ప్రచారం తీసుకు రావొచ్చు! జగన్ కు అన్యాయం జరుగుతోందని అనేక మంది మేధావులు అభిప్రాయపడ్డారని టీవీ ద్వారా ప్రచారం చేసుకోవచ్చు! ఇలా ఉంది జగన్ బ్యాచ్ కార్యాచరణ... పదే పదే తమ అధినేతను అన్యాయంగా జైల్లో పెట్టారని నినదించడం వల్ల లబ్ధి పొందాలనేది జగన్ పార్టీ ప్లాను..మరి ఇది ఏ మేరకు వర్కువుటవుతుందో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు