కేసీఆర్‌ దాహం తీర‌నిది...మ‌ళ్లీ అదే స్కెచ్‌

కేసీఆర్‌ దాహం తీర‌నిది...మ‌ళ్లీ అదే స్కెచ్‌

తెలంగాణ‌లో జ‌ర‌గ‌నున్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో..టీఆర్ఎస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 110కి పైగా మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ అభ్య‌ర్థులే ఆధిక్యం సాధించారు. ఇది నిజంగా గొప్ప విజ‌యం. అయితే, ఈ విజ‌యంతో టీఆర్ఎస్ పార్టీ పెద్ద‌లు సంతృప్తి ప‌డటం లేదట‌. గ‌తంలో చేసిన‌ట్లే...ఇంకా జంపింగ్‌ల‌ను ప్రోత్సాహించాల‌ని చూస్తున్నార‌ట‌. ఎలాగైనా...అధికార పీఠం కైవ‌సం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. ఈ ప‌రిణామం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

పుర‌పోరులో భాగంగా, ఇప్పటికే 110కిపైగా మున్సిపాలిటీల్లో మెజార్టీ సాధించిన టీఆర్‌ఎస్‌.. అవకాశం ఉన్న పురపాలికలనూ దక్కించుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం అన్ని అవ‌కాశాలు స‌ద్వినియోగం చేసుకుంటోంది. ప్ర‌ధానంగా స్వతంత్రులపై దృష్టి సారించింది. స్థానిక నాయకత్వం ఇప్పటికే వీరితో మాట్లాడి పార్టీకి మద్దతు కోరింది. `మరో నాలుగేళ్ల‌పాటు అధికారంలో ఉండే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ద్వారానే మీకు మేలు జ‌రుగుతుంది` అనే మాట‌ను చెవిన వేస్తోంది. ప్రజలకు అభివృద్ధి చేసేందుకు అవకాశం లభిస్తుందన్న మాట చెప్పి...టీఆర్ఎస్ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరుతున్నారు.  దీంతో ఇప్పటికే 90శాతం మంది ఇండిపెండెంట్లు టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చేందుకు ముందుకొచ్చారట‌.

మ‌రోవైపు టీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శనివారం సాయంత్రం నుంచి స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లామంత్రులతో స్వయంగా మాట్లాడుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఎక్స్‌అఫీషియో ఓట్లను జాగ్రత్తగా ఉపయోగించుకొనేందుకు ఏర్పాట్లు చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. మున్సిపాలిటీలు కైవ‌సం చేసుకునే అవ‌కాశాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ విడిచిపెట్ట‌వ‌ద్ద‌ని...ఆయ‌న స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English