కేసీఆర్, కేటీఆర్‌ను కాల్చి చంపినా ప‌ర్లేదు - ఎంపీ

కేసీఆర్, కేటీఆర్‌ను కాల్చి చంపినా ప‌ర్లేదు - ఎంపీ

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌ట‌రెడ్డి వెంక‌ట్ రెడ్డి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. త‌మ‌కు ఆధిక్యం ద‌క్కిన చోట టీఆర్ఎస్ మున్సిప‌ల్ పీఠం కైవ‌సం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆరోపించిన ఆయ‌న ఈ సంద‌ర్భంగా విరుచుకుప‌డ్డారు. అక్రమ మార్గంగా యాదగిరిగుట్టలో మునిసిపల్ ఛైర్మెన్ పదవిని దక్కించుకోవలని టీఆర్ఎస్ పార్టీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

యాదగిరిగుట్టలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మెజార్టీ ఇచ్చారని పేర్కొన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అయిన‌ప్ప‌టికీ...లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా ప్రజాస్వామ్యని ఖుని చేస్తున్నారని ఆరోపించారు. వ‌రంగల్‌కు చెందిన కడియం శ్రీహరితో ఎక్సఆఫిషియో ద్వారా ఓటు వేపిస్తున్నారని ఆరోపించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌లు పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇలాంటి వాళ్ళను కాల్చి చంపిన తప్పు లేదని ఆయ‌న వివాదాస్పద వ్యాఖ్య‌లు చేశారు. ఖబర్దార్ కేసీఆర్ అంటూ ఎంపీ కోమ‌టిరెడ్డి వ్యాఖ్యానించారు.

యాదగిరిగుట్టలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అక్రమ భూ దందా చేస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. తుర్కపల్లి లో కేసీఆర్ కూతురు కవిత అక్రమంగా 500 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందని పేర్కొన్న కోమ‌టిరెడ్డి త‌న దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్‌స్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఇచ్చిన యాదగిరిగుట్ట ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ఎంపీ కోమ‌టిరెడ్డి యాదగిరిగుట్టను కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగ‌ణ సీఎం కేసీఆర్ 12 సార్లు యాదగిరిగుట్టకు వచ్చినప్ప‌టికీ ఇక్కడి పేద ప్రజలకు ఏమి చేయలేదని ఆరోపించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English