లోకేశ్.. బలిసిన కోడి.. చికెన్ షాపు ముందు తొడ కొడితే?

లోకేశ్.. బలిసిన కోడి.. చికెన్ షాపు ముందు తొడ కొడితే?

ఏపీ అధికారపక్ష ఫైర్ బ్రాండ్ నేత ఆర్కే రోజా మాటలు ఎంత సూటిగా.. చురుకు పుట్టేలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికారపక్షంగా తాము తీసుకునే నిర్ణయాల్ని మండలిలో అడ్డుకోవటం.. అదేదో ఘనకార్యం చేసినట్లుగా చేస్తున్న టీడీపీ తీరుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా మండలిని రద్దు చేస్తూ జగన్ సర్కారు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

ఇలాంటివేళ.. మండలి రద్దు నిర్ణయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సమర్థించుకుంటున్నారు. మిగిలిన నేతల సంగతి ఎలా ఉన్నా.. విషయం ఏదైనా కుండ బద్ధలు కొట్టే ఆర్కే రోజా తాజాగా విపక్ష నేతల్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆమె తెచ్చిన పోలిక ఒకటి సంచలనంగా మారింది. బాగా బలిసిన కోడి చికెన్ షాపు ముందు నిలుచొని తొడ కొడితే ఏమవుతుందని.. కోసి కారం పెడతారంటూ.. అదే రీతిలో మండలిలో విపక్ష నేతలు చెలరేగిపోతే.. రద్దు చేస్తామన్న అర్థం వచ్చేలా మాట్లాడారు. ఆమె నోటి నుంచి వచ్చిన బలిసిన కోడి వ్యాఖ్యలు టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేశ్ ను ఉద్దేశించి అని చెప్పక తప్పదు. సంచలనంగా మారిన ఈ వ్యాఖ్యలతో పాటు.. రోజా చేసిన కీలక వ్యాఖ్యలు చూస్తే..

*  టీడీపీ పెద్దల సభను అపహాస్యం చేస్తోంది. చంద్రబాబు మండలి గ్యాలరీలో కూర్చొని... మండలి ఛైర్మన్‌ను ఎలా కంట్రోల్ చేశారో అందరూ చూశారు. ఇది దురదృష్టకరం.
*  అప్పట్లో ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచారు. గతంలో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొన్నారు. వారిలో నలుగురిని మంత్రుల్ని చేశారు. ఇలా బాబు వ్యవస్థల్ని బ్రష్టు పట్టిస్తున్నారు. ఆయన ఎంతకైనా దిగజారుతాడు.
*  మండలిలో టీడీపీ రూల్స్ ప్రకారం వెళ్లలేదు. ముందుగా నోటీస్ ఇచ్చి ఉంటే బాగుండేది. అలా చెయ్యలేదు. మండలికి వెళ్లే బిల్లుల్ని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తిప్పికొడుతున్నారు. రాయలసీమను బాబు నాశనం చేశారు.
*  ఇప్పుడు సీఎం జగన్.. రాయలసీమను అభివృద్ధి వైపు నడిపిస్తూ.. కర్నూలును రాజధానిగా చేస్తున్నారు. జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. చంద్రబాబు, ఆయన బినామీలూ అమరావతిలో భూముల్ని కాపాడుకోవడానికే.. మండలిలో డ్రామా ఆడుతున్నారు.
*  జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో 80 శాతం హామీలను నెరవేర్చారు. ప్రజలంతా ఆయన్ను మెచ్చుకుంటున్నారు. ప్రజా తీర్పును గౌరవించాల్సిన టీడీపీ.. కావాలని మండలిలో ఆలస్యం చేస్తూ.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది.
*  లోకేష్ ఏదో ఘనకార్యం చేసినట్లు ఫీలవుతున్నాడు. బాగా బలిసిన కోడి.. చికెన్ షాపు ముందు తొడగొడితే ఏమవుతుంది? కోసి కారం పెడతారు. ఆ విషయం లోకేష్ తెలుసుకోవాలి. యనమలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
*  మండలి ఉండటం వేస్ట్. దానికి పెట్టే ఖర్చు వృథా. దాన్ని తొలగించాలని రాయలసీమ వాసులు కోరుతున్నారు. పెద్దల సభ అంటే  పెద్దల్ని ఆ సభకు పంపాలి. అంతేకానీ ఇంట్లోని దద్దమ్మల్ని, దద్దోజనాన్నీ పంపకూడదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English