లోకేష్ పంచ్ ఇచ్చాడు.. ప‌వ‌న్ కూడా సై అంటున్నాడు

లోకేష్ పంచ్ ఇచ్చాడు.. ప‌వ‌న్ కూడా సై అంటున్నాడు

చిన‌వాబు చిరుతిండి ఖ‌ర్చు రూ.25 ల‌క్ష‌లు అంటూ గ‌త ఏడాది సాక్షి ప‌త్రిక మాజీ మంత్రి నారా లోకేష్ మీద రాసిన ఓ క‌థ‌నం ఎంత‌టి సంచ‌ల‌నం రేపిందో తెలిసిందే. ఐతే సాక్షి క‌థ‌నం శుద్ధ అబ‌ద్ధ‌మ‌న్న లోకేష్ అందుకు సాక్ష్యాలు కూడా చూపించాడు. 2019 అక్టోబ‌ర్ 22న విశాఖ విమానాశ్రయంలోని క్యాంటీన్లలో.. లోకేష్.. రూ. 25 లక్షలకు చిరుతిళ్లు తిన్నారని.. అదంతా ప్రజాధనమని సాక్షి పేర్కొన‌గా.. అస‌లా తేదీన తాను విశాఖ‌లోనే లేనంటూ ప్రూఫ్ చూపించాడు లోకేష్.

దీనిపై క్ష‌మాప‌ణ చెప్పాల‌ని, ప‌త్రిక‌లో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని డిమాండ్ చేయ‌గా.. సాక్షి అంగీక‌రించ‌లేదు. దీంతో నారా లోకేష్ ఆ ప‌త్రిక మీద ప‌రువు న‌ష్టం దావా వేశాడు. ఏకంగా రూ.75 కోట్ల‌కు ఆయ‌న దావా వేయ‌డం విశేషం. అధికార పార్టీ అండ‌తో రెచ్చిపోతున్న సాక్షికి అడ్డుక‌ట్ట వేయ‌డానికి ఇదే మార్గ‌మ‌ని లోకేష్ భావిస్తున్న‌ట్లున్నాడు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు త‌న గురించి చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని తిప్పి కొట్ట‌డానికి జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం లోకేష్ చూపించిన మార్గాన్నే అనుస‌రించ‌నున్నాడు. ప‌వ‌న్‌కు అమ‌రావ‌తిలో 62 ఎక‌రాల స్థ‌లం ఉంద‌ని, అందుకే అత‌ను అమ‌రావ‌తి నుంచి రాజ‌ధాని త‌ర‌లించ‌కుండా అడ్డం ప‌డుతూ పోరాటాలు చేస్తున్నార‌ని వైకాపా నేత ఒక‌రు ఆరోపించారు.

దీన్ని ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు గ‌ట్టిగానే ప్ర‌చారం చేస్తున్నారు. ఐతే ఇదంతా అబ‌ద్ధ‌మ‌ని ఆల్రెడీ జ‌న‌సేన త‌ర‌ఫున ప్రూఫ్స్ చూపించారు. అంత‌టితో ఆగ‌కుండా జ‌న‌సేనానిపై ఆరోప‌ణ‌లు చేసిన నేత‌ల‌పై ప‌రువు న‌ష్టం దావా వేయాల‌ని పార్టీ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. దీనిపై వైకాపా వాళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English