సోష‌ల్ మీడియాపై కేసీఆర్ ఫోక‌స్‌...క‌ఠిన చ‌ట్టాలే

సోష‌ల్ మీడియాపై కేసీఆర్ ఫోక‌స్‌...క‌ఠిన చ‌ట్టాలే

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు కొనసాగడంతో...పార్టీ కేంద్ర కార్యాల‌య‌మైన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇంత భారీ విజ‌యం క‌ట్ట‌బెట్టిన ప్ర‌జ‌ల‌కు శిర‌సా వ‌హిస్తామ‌ని తెలిపారు. త‌మ సెక్యుల‌ర్ విధానాల‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టార‌ని కేటీఆర్‌ స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాపై కేసీఆర్ క‌న్నెర్ర చేశారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని  సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు.

సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా దూషిస్తే ఊరుకోబోమని కేసీఆర్ తేల్చిచెప్పారు. వ్యక్తిగత దూషణలు మంచిది కాదని కేసీఆర్ అన్నారు. ``అది సోషల్ మీడియానా? లేక యాంటీ సోషల్ మీడియానా? ఇలాంటివి గవర్నమెంట్ ఎలా అనుమతిస్తోంది? సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై  కఠిన చర్యలు తీసుకుంటాం` అని అన్నారు. సీఎంను దూషిండం కరెక్ట్ కాదని అన్నారు. ఒకరైతే ముఖ్యమంత్రి ముక్కుకోస్తా అంటారు. జాతీయ పార్టీలో ఉంటూ అలాంటి విమర్శలు చేయడం కరెక్టేనా అని కేసీఆర్ ప్ర‌శ్నించారు.

తాము సాధించిన ఫ‌లితాలు భార‌త‌దేశంలోనే రికార్డ్ అని కేసీఆర్ అన్నారు.  ఒక పార్టీ, నాయకత్వం పట్ల ఇంత ఆదరణను, హవాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ``ముందుస్తు అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలు గెలిచాం. నాడే ప్రజలు అద్భుతమైన సంకేతం ఇచ్చారు. హుజుర్‌నగర్‌ గెలుపుతో 89కి చేరింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 32 జిల్లాలకు 32 జిల్లా పరిషత్‌లు గెలిచాం.

ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అదే హవా కొనసాగింది అని సీఎం పేర్కొన్నారు. టీఆర్ఎస్‌ పార్టీ బాగా పని చేసినందుకే ఈ గెలుపు సాధ్యమైందన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పార్టీ రూ. 80 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టింద‌ని కేసీఆర్ తెలిపారు. ``ఆ ఖర్చు పెట్టింది కూడా పార్టీ మెటీరియల్ కోస‌మే చేశాం. ఇదేమీ తెలియకుండానే లక్షల కోట్లు ఖర్చు పెట్టారని ఎలా అంటారు? అవాకులు, చెవాకులు మానేసి ప్రజల తీర్పును గౌరవించాలి. ఓటేసిన ప్రజలను అవమానిస్తారా? `` అంటూ ప్ర‌తిప‌క్షాల‌పై క‌న్నెర్ర చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English