మున్సిపల్ నగారా మోగింది

మున్సిపల్ నగారా మోగింది

ఇప్పుడు పార్టీలకు దిమ్మ తిరిగిపోతోంది. తలవని తలంపుగా, ఉరుము లేని పిడుగులా మున్సిపల్ ఎన్నికలు ఊడిపడ్డాయి. మరో వారం రోజుల్లో నామినేషన్లు వేయాలి. మరో మూడు వారాల్లో ప్రచారం పూర్తి చేయాలి. ముఫై నాటికి తీర్పుకు రెడీ అయిపోవాలి. ఒక పక్క ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలకు రెడీ అవుతున్న తరుణంలో జరగాలి. పైగా మున్సిపాల్టీల ప్రభావం కచ్చితంగా శాసనసభ ఎన్నికలపై వుంటుంది. ఇక చూస్తోండి నా రాజా..రంజుగా మారింది రాష్ట్ర రాజకీయం.

అసలే వలసలు ఇతరత్రా వ్వవహారాలతో కిందామీదా అవుతున్న పార్టీలు ఇప్పుడు మున్సిపాల్టీ ఎన్నికలపై దృష్టి పెట్టాలంటే అంత చిన్న విషయం కాదు. ముఖ్యంగా జగన్ లాంటి సింగిల్ మేన్ ఆర్మీ పార్టీలకు మరీ కష్టం. అన్ని నిర్ణయాలు తానే తీసుకోవాలి, ప్రచారం తానే సాగించాలి. ఎవర్నీ నమ్మేందకు లేదు అన్న టైపు జగన్.మరి అలాంటివారికి ఈ ఎన్నికలు ఈదడం అంటే కాస్త కష్టమే.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English