కేటీఆర్‌కు 'ప‌ట్ట‌ణాభిషేకం'... ముహుర్త‌మే లేటు

కేటీఆర్‌కు 'ప‌ట్ట‌ణాభిషేకం'... ముహుర్త‌మే లేటు

ఎన్నిక ఏదైనా ఫ‌లితం టీఆర్ఎస్ పార్టీ వైపు అన్న‌ట్లుగా తెలంగాణ‌లో మారిన ట్రెండ్‌లో... మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనూ కారు జోరు కొనసాగింది. 100కు పైగా మున్సిపాలిటీల్లో విజయం సాధించింది. మిగ‌తా చోట్ల ఎదురులేని ఆధిక్యంతో దూసుకుపోతోంది. గెలుపు ధైర్యం ప్రదర్శించిన కాంగ్రెస్, బీజేపీలు  ‌కనీసం టీఆర్ఎస్‌ దరిదాపుల్లో కూడా లేవు.

కనీస పోటీ కూడా ఇవ్వలేకపోగా… సింగిల్ డిజిట్‌కే పరిమయ్యాయి. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీలు ఖాతా తెరవలేదు. ఈ గెల‌పుతో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ముఖ్య‌మంత్రి పీఠం క‌ట్ట‌బెడ‌తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

మొత్తం 120 మున్సిపాలిటీల్లో 100 కైవ‌సం చేసుకోవ‌డం, మొదటి దశలో ఎన్నికలు జరిగిన 9 మున్సిపల్ కార్పోరేషన్లలో…అన్నింటినీ టీఆర్ఎస్‌ కైవసం చేసుకోవ‌డాన్ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖాతాలోనే గులాబీ నేత‌లు చేరుస్తున్నారు. పార్టీ నేతగా సీఎం కేసీఆర్ స‌మ‌న్వ‌యం కొన‌సాగిన‌ప్ప‌టికీ...  క్షేత్ర‌స్థాయిలో వ్యూహాల‌న్నీ కేటీఆర్‌కు సొంత‌మంటున్నారు .ఈ ప్ర‌క‌ట‌న‌లు ఆయ‌న‌కు సీఎం పీఠం క‌ట్ట‌బెట్టే సిగ్న‌ల్స్ అని తెలుస్తోంది.

ఇదిలా ఉండ‌గా, టీఆర్ఎస్ గెలుపుపై ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ స్పందించారు. రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పార్టీకి భారీ విజయం అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని ప్రజలు మరోసారి బలపరిచారు అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత నుంచి ప్రతి ఎన్నికల్లో గెలుస్తూ వచ్చాం.
2014 నుంచి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. మున్సిపల్‌ మంత్రిగా ఈ ఫలితాలు తన బాధ్యతను మరింత పెంచాయని కేటీఆర్‌ చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు. 100కు పైగా మున్సిపాలిటీల్లో విజయం సాధించడం గొప్ప విషయం అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English