మున్సిపాల్టీలే కీలకం

మున్సిపాల్టీలే కీలకం

రాష్ట్రంలోని నగర పాలక సంస్థలు, మున్సిపాల్టీల ఎన్నికలు ముంచుకోస్తున్నాయి. వేళకాని వేళ, కోర్టు ఆదేశాల కారణంగా ఎన్నికలు అనివార్యమ్యాయి.సాధారణ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో పురపాలిక, నగరపాలిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో పట్టణాలు,నగరాల  ప్రజలు ఏ పార్టీని ఎంతగా విశ్వసిస్తున్నారు అన్నది తేలిపోతుంది. అందుకే  ఈ ఎన్నికలు రాష్ట్రంలోని అన్ని పార్టీలకు అసలుసిసలైన అగ్రిపరీక్ష కాబోతున్నాయి.  ప్రదానంగా బిజేపికి ఈ ఎన్నికలు రెఫరెండంలాంటివన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

కారణం బిజేపి ప్రచార సారథి మోడి మానియా ప్రధానంగా పట్టణాల్లో, నగరాల్లో ఎక్కువ ఉందని, యువత ఇక్కడే ఆయనపై మక్కువ చూపుతున్నారని ఎన్నో సర్వేలు తేల్చి చెప్పాయి. అందుకే ఈ ఎన్నికల్లో బిజేపి, మోడిల అసలు బలం బయట పడే అవకాశం వుంది. అయితే ఈ ఎన్నికలు స్థానిక నేత ఆదారంగా జరగుతాయని, లోక్ సభ విషయానికి వస్తే అది వేరుగా ఉంటుందన్నది కూడా వాస్తవమే అయినా, బిజేపి అభ్యర్థులను నిలబెట్టిన చోట మాత్రం ఆ పలితాలు మోడి క్రేజి, బిజేపి భవిష్యత్ కు కాస్త సంకేతాలు ఇస్తాయని అనుకోవడంలో తప్పులేదు.

 తెలంగాణలో, సమైక్యాంద్రలో హీరోలం మేమే అంటూ బిజేపి, తెలుగుదేశం వంటి పార్టీలు ముందుకు పోతున్నాయి. ఇక టిఆర్ఎస్ తెలంగాణలో, వైకాపా సీమాంద్రలో ఆశలు పెట్టుకున్నాయి. దీంతో వీటి భవిష్యత్తును ఈ ఎన్నికలు దాదాపుగా తేట తెల్లం చేస్తాయి. ఈ ఎన్నికల్లో అవి సాధించిన విజయాలు వారి పట్టు ఎంత మేరకు ఉందన్నది చెప్పడమే కాకుండా ఈ ఎన్నికలకు సాధారణ ఎన్నికలకు ఎంతో దూరం లేనందును దాదాపు ఇదే రకమైన పలితాలు సాధారణ ఎన్నికల్లో ఉంటాయన్నది కాస్త ఒప్పుకోవాల్సిన విషయమే. అందుకే ఈ పురపాలిక, నగరపాలిక సమరం నిజంగా అన్ని రాజకీయ పార్టీలకు ఫైనల్ క్వాలిఫైయింగ్ వంటి ఎన్నికలే అని అనుకోవాలి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English