అమ‌రావ‌తిలో సీఐడీ...టార్గెట్ వారే

అమ‌రావ‌తిలో సీఐడీ...టార్గెట్ వారే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. అమరావతి భూముల కొనుగోలుపై గ‌త కొద్దికాలంగా కీల‌క వ్యాఖ్య‌లు చేస్తున్న ప్ర‌భుత్వం తాజాగా ఈ కొనుగోలు వ్య‌వ‌హారాల‌పై సీఐడీకి బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఈ మేర‌కు సీఐడీ కేసు నమోదు చేసింది. ల్యాండ్ పూలింగ్‌పై కేసు నమోదు చేసిన సీఐడీ విచారణ చేస్తోంది. 796 తెల్ల రేషన్‌కార్డు దారుల‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. తెల్లరేషన్ కార్డు ఉన్న వారు ఎకరం రూ.3 కోట్లు పెట్టి భూమి ఎలా కొనుగోలు చేశారనే అంశాన్ని ప్ర‌ధానంగా ప్ర‌స్తావించింది.

తెల్ల రేషన్‌కార్డుదారులు రూ.3 కోట్లకు చొప్పున ఎకరం భూమి కొనుగోలు చేసినట్లు సీఐడీ గుర్తించింది. ఇలా
రూ.300 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్లు సీఐడీ గుర్తించింది. తెల్ల రేషన్ కార్డుదారుల‌తో భూములు కొనుగోలు చేయించిన వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. విచారణ కోసం సీఐడీ నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. 131 మంది తెల్లరేషన్‌ కార్డుదారులు మొత్తం 129 ఎకరాలు కొన్నట్లు తేలింది. మాజీ మంత్రులపై క్రిమినల్ కేసు, తెల్లరేషన్ కార్డుదారులపై విచారణ కోసం టీమ్స్ పనిచేస్తాయని

43 మంది తెల్లరేషన్‌ కార్డుదారులు పెద్దకాకానిలో 40 ఎకరాలు కొన్నారు. తాడికొండలో 188 మంది తెల్లరేషన్‌ కార్డుదారులు 180 ఎకరాలు కొన్నారు. తూళ్లూరులో 243 ఎకరాలను 238 మంది తెల్లరేషన్‌ కార్డుదారులు కొనుగోలు చేశారు. మంగళగిరిలో 148 మంది తెల్లరేషన్‌ కార్డుదారులు 133 ఎకరాలు కొన్నట్లు తేలింది. తాడేపల్లిలో 49 మంది తెల్లరేషన్‌ కార్డుదారులు  24 ఎకరాలు కొన్నట్లు గుర్తించారు. ఈ మేర‌కు స‌మ‌గ్ర వివ‌రాల ఆధారంగా విచార‌ణ జ‌ర‌పనున్న‌ట్లు స‌మాచారం. కాగా, ఈ విచార‌ణలో గ‌త ప్ర‌భుత్వంలో  మంత్రులుగా ఉన్న‌వారు ఎక్కడ, ఎవరి పేరుతో ఎంత మొత్తంలో భూములు కొనుగోలు చేశారనే అంశం విచారణలో వెలుగులోకి రానుందని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English