బిజేపి ద్విముఖ వ్యూహం

బిజేపి ద్విముఖ వ్యూహం

బిజేపి రాష్ట్రంలో ద్విముఖ వ్యూహంతో ముందుకు పోతున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే పార్లమెంటుకు తెలంగాణ బిల్లు వచ్చిన సందర్భంగా ఉన్నట్టుండి సీమాంద్ర సమస్యల పరిష్కరాన్ని భుజాన వేసుకున్నట్లు కనిపిస్తోంది. అప్పట్లో అది టిడిపితో పొత్తు కోసం, కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టడం కోసం సడన్ గా తన వైఖరిలో మార్పు తెచ్చుకుంది అనుకున్నారు. కాని బిజేపి ఇప్పుడు ముందుకు పోతున్న తీరు చూస్తే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెలంగాణలోను నష్టపోకుండా, సీమాంద్రలోను లాభం పొందే విదంగా ఉండేందుకే అలా వ్యవహరించారని అర్థమవుతోంది.

ఇప్పడు బిజేపి తెలంగాణ బిల్లును గట్టెక్కించి ఏర్పాటుకు సహకరించింది. ఈ సంధర్భంగా సుష్మాస్వరాజ్, కిషన్ రెడ్డి అండ్ గ్యాంగ్ కంప్లీట్ గా తెలంగాణ వైపునకు మొగ్గుచూపారు. ఇదే సమయంలో వెంకయ్యనాయుడు, నరేంద్రమోడి వంటి వారు సీమాంద్రవైపు కు మొగ్గు చూపారు. ఆ విధానాన్ని ఇప్పుడు అలా కొనసాగిస్తున్నారు. లోక్ సభలో సుష్మా స్వరాజ్ సీమాంద్ర సమస్యల ప్రస్తావనే తీసుకురాకుండా బిల్లుకు మద్దతిస్తే, రాజ్యసభలో వెంకయ్యనాయుడు అనూహ్యంగా సీమాంద్ర సమస్యలను తెరపైకి తెచ్చి కొంతలో కొంత హామి పొంది సీమాంధ్రకు తన వల్ల అంటే బిజేపి వల్ల లాభం జరిగిందన్న భావం కల్పించడంలో సక్సెస్ అయ్యారు.

అంతే కాదు ఇప్పుడు సీమాంద్రలో వారు అదే ప్రచారం చేయబోతున్నారు. సీమాంద్ర కేంద్ర మంత్రులు కూడా సాధించని కొన్ని ప్రయోజనాలను తాను సాధించానని వెంకయ్యనాయుడు అక్కడ బిజేపి తరఫున రంగంలోకి దిగుతున్నారు. మరో వైపు మోడి కూడా తాజాగా సీమాంద్రను కాంగ్రెస్ అనాథను చేసింది అంటూ ఆయన కూడా సీమాంద్ర పల్లవి అందుకున్నారు. అంతే కాదు సీమాంధ్ర వారికి న్యాయం చేస్తాను, అంటూ వారికి భరోసా ఇచ్చేందుకు సీమాంద్రలో పర్యటించనున్నట్లు కూడా ప్రకటించారు.

అంటే వెంకయ్య, మోడి అండ్ గ్యాంగ్ సీమాంద్రలో వారికి అనుకూలంగా, బేషరతుగా లోక్ సభలో తెలంగాణ బిల్లును ఆమోదింప చేసిన సుష్మాస్వరాజ్ అండ్ కిషన్ రెడ్డి గ్యాంగ్ ఇటు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారన్న మాట. అంతే కాదు రేపు కేంద్రంలో మీరు అంటే ఏపి నుంచి మమ్మలను గెలిపించినా గెలిపించకపోయినా కూడా అధికారంలోకి వచ్చేది మేమే, అంటే ఇరు రాష్ట్రాలను అభివృద్ది చేయాలంటే తామే చేయాలి అందుకు మీరు మాకు మద్దతివ్వాలో వద్దో ఆలోచించుకోండి అంటే కూడా బిజేపి పరిస్థితి పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే వారు ఏపిలో ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సిద్దమయ్యారు. అసలే బలం లేని రాష్ట్రంలో కాంగ్రెస్ ను దెబ్బతీసి అంతో ఇంతో ప్రయోజనం పొందితే కూడా బిజేపి సక్సెస్ అయినట్టే కదా...అందుకే వారి ద్విముఖ వ్యూహం బిజేపి ఎంతో కొంత లాభం చేకూరుస్తుంది అంటున్నారు. అంతే కాదు తెలంగాణ, సీమాంద్రలో అదికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్న వైకాపా, టిఆర్ఎస్ లు కూడా రేపటి అవసరాల కోసం దానికి మద్దతిచ్చే అవకాశాలు ఎలాగు ఉన్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అంటే బిజేపి సొంతంగా సీట్లు ఎన్ని సాధించినా సాధించకపోయినా కూడా రేపు కేంద్రంలో అధికారానికి ఏపి నుంచి మద్దతును సంపాదిస్తున్నట్టే కదా.. అన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English