పీకే ఆర్డర్... రాపాక చెత్తబుట్టలో పడేసినట్టేగా

పీకే ఆర్డర్... రాపాక చెత్తబుట్టలో పడేసినట్టేగా

ఏపీ రాజకీయాల్లో ఏదో సాధిస్తానని, అవకాశం దక్కితే ఏకంగా సీఎం కుర్చీనే ఎక్కేస్తానంటూ బీరాలు పలికిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్... మొన్నటి ఎన్నికల్లో బొక్కబోర్లా పడిపోయారు. నిలబడ్డ రెండు చోట్లా తనను ప్రజలు చిత్తుగా ఓడించడంతో డబుల్ స్ట్రోక్ తగిలిన వాడిలా వ్యహరించిన పవన్... ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ కాస్తంత యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో తాను గెవలకున్నా... తన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాపాక వరప్రసాద్ అయినా పార్టీ వాణిని అసెంబ్లీలో వినిపిస్తారని ఆశించినా...అదీ నిరాశే అయ్యింది. జనసేన ఎమ్మెల్యేగానే కొనసాగుతన్న రాపాక... అసలు పార్టీ సమావేశాలకే హాజరు కావడం లేదు. అంతటితో ఆగని ఆయన ఏకంగా జగన్ అనుకూల వైఖరిని భుజానికెత్తేసుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో పెను సమస్యగా పరిణమించిన రాజధాని వ్యవహారంపై పార్టీ వాణి ఇదేనని, దీనినే మీరు అసెంబ్లీలో వినిపించాలంటూ రాపాకకు పవన్ అల్టిమేటమ్ జారీ చేశారు. ఈ మేరకు పార్లీ వైఖరి ఇదేనంటూ రాపాకకు పవన్ ఓ లేఖ రాశారు.

ఆ లేఖలో ఏముందన్న విషయానికి వస్తే... ‘ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని పార్టీలో వివిధ స్థాయిల్లో జరిగిన సమావేశాల్లో ఏకాభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. రాజధాని నిర్మాణం అమరావతిలోనే కొనసాగాలని, ప్రభుత్వ పాలన పూర్తిగా అమరావతి నుంచే కొనసాగాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఈ సమావేశాల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఈ రోజు జరగనున్న సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ఈ క్రింది బిల్లులు ప్రవేశపెడుతున్న సంగతి మీకు విదితమే. 1. ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవలప్ మెంట్ రీజియన్ యాక్ట్-2020, 2. అమరావతి మెట్రో డెవలప్ మెంట్ యాక్ట్ -2020. పార్టీ నిర్ణయానుసారం మీరు శాసనసభా సమావేశాలకు హాజరై పై రెండు బిల్లులు ప్రవేశపెట్టే సమయంలోనూ, ఓటింగ్ లోనూ వ్యతిరేకించవలసిందిగా కోరుతున్నాను’ అంటూ సదరు లేఖలో రాపాకకు పవన్ దిశానిర్దేశం చేశారు.

అయితే ఇప్పటికే అటు రాజధాని విషయంలోనూ , ఇటు జగన్ సర్కారు ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకం విషయంలోనూ జగన్ సర్కారుకు అనుకూల వైఖరితోనే సాగుతున్న రాపాక... మూడు రాజధానుల విషయాన్ని స్వాగతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను గెలిచిన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశిస్తే.. ఇప్పుడు రాపాక తన వైఖరి మార్చుకుని జగన్ సర్కారు బిల్లులకు వ్యతిరేకంగా గళం విప్పుతారా? అంటే... ఛాన్సే లేదన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా ఏదో అలా సైలెంట్ గా ఉన్నా పరువు పోకుండా ఉండేది... ఇప్పుడు రాపాక చేయనన్న పనిని చేయాలంటూ పవన్ కల్యాణ్ ఏకంగా జనసేన అధినేత హోదాలో రాపాకకు లేఖ రాయడం, ఆయనకు దిశానిర్దేశం చేసి అభాసుపాలయ్యారన్న మాట వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English