క్యాడర్ పోయింది – లీడర్ మిగిలాడు

క్యాడర్ పోయింది – లీడర్ మిగిలాడు

చిరంజీవి పరిస్తితి చిత్రంగా మారింది. అదేంటంటే ఆయన క్యాడర్ అంతా పోయింది, లీడర్ గా ఆయన మాత్రం మిగిలాడు, దీంతో కాంగ్రెస్ లో కూడా ఆయన పరిస్థితి ఏమిటి?, ఆ పార్టీ  ఇంతకు ముందు ఇచ్చిన ప్రాధాన్యత ఇస్తుందా, లేక తన సహజమైన రీతిలో అవసరం తీరాకా... అంటూ కూరలో కరివేపాకు లాగా  తయారు చేస్తుందా.. చిరంజీవి కారణంగా అందలం ఎక్కిన గంటా అండ్ గ్యాంగ్ అంతా టిడిపిలోకి చేరడంతో ఇక ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ లోకి కలిసిన వారంతా చిరంజీవిని కూడా వదిలి వెళ్లినట్టే. మిగిలిందల్లా చిరంజీవి, ఆయన నమ్మిన బంటు రాంచంద్రయ్య మాత్రమే. దీంతో చిరంజీవి పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారయింది కాంగ్రెస్ చిరంజీవిని  దగ్గరకు తీసింది. ఆయన వెంట ఉన్న క్యాడర్, బలగాన్ని చూసే కదా.. అదే లేక పోయాక ఒక్క చిరంజీవిని పట్టుకుని అది ఎంత కాలం వేలాడుతుంది. అంతే కాదు ఇప్పుడు చిరంజీవి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోటీ చేసి తనకు తానే గెలవడం కూడా అంత సులువు కాదు.

అలాంటిది తాను కాంగ్రెస్ వారిని ఇంకేం గెలిపిస్తారు అన్న కోణంలో కూడా కాంగ్రెస్ ఆలోచిస్తే చిరంజీవి పరిస్థితి కాస్తా డేంజర్ లో పడ్డట్టే. అయినా చిరంజీవి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇదంతా ఆయన స్వయం కృతాపరాదమేనా ? కాంగ్రెస్ లో ఉండి కూడా లగడపాటి, రాయపాటి వంటి వారే కాదు ఎంతో ఉన్నత పదవిలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కూడా సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించినప్పుడు ఆపని చిరంజీవి ఎందుకు చేయలేక పోయారు.

పైగా చిరంజీవికి సమైక్యాంద్ర విషయంలో అలా చేయడానికి ముఖ్యమంత్రి కిరణ్ అండ్ ఆయన బృందం కంటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతే కాదు సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు కూడా సీమాంద్రలో చిరంజీవినే ఎక్కువ టార్గెట్ చేసుకున్నారు. అప్పుడే నేను కాంగ్రెస్ లో కలిసింది దీని కోసం కాదు, ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకోలేదు, అందుకే కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతున్నా, నా ప్రజారాజ్యాన్ని తిరిగి స్థాపిస్తా అంటూ బయటకు వస్తే ఇప్పుడు ఆయనను వదిలేసిన ఆయన క్యాడరే కాదు, కిరణ్ వెంట నడిచేందుకు సిద్దమైన వారంతా ఆయన వెంటే ఉండి ఎంతో బలోపేతంగా తయారయ్యే వారు అన్న వాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.

కేవలం ఓ కేంద్ర మంత్రి పదవి కోసం వేలాడి, అది కూడా చివర్లో మహా అయితే మూడు నెలల కోసం పాకులాడి తన రాజకీయ జీవితానికి ముప్పు తెచ్చుకున్నారు చిరంజీవి అన్న భావం అంతటా వ్యక్తం అవుతోంది. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపిన మరుక్షణమే కాంగ్రెస్ ఆయనకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మోసం చేసింది. ముఖ్యమంత్రి పదవి కాదు కదా ఉన్న ఎమ్మెల్యే పదివికి కూడా ఎసరు పెట్టి ప్రజల ముందు ఆయనను జోకర్ చేసింది.

అలాంటప్పుడు ఆయనకు సమైక్యాంధ్ర ఉద్యమం కలిసి వచ్చింది, అప్పుడే జై సమైక్యాంధ్ర అంటూ చేసిన తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి ఉన్నదంతా పోగొట్టుకున్నారు. సినిమా రంగంలో సంపాదించుకున్న పేరుతో పాటు అభిమానులను, రాజకీయంగా సంపాదించుకున్న క్యాడర్ను పోగొట్టుకుని రెండికి చెడ్డ రేవడిలా చిరంజీవి మారాడు అన్నది మాత్రం నిజం

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English