బీజేపీ.. జనసేన పొత్తు వెనుక కథ నడిపింది అతనేనా?

బీజేపీ.. జనసేన పొత్తు వెనుక కథ నడిపింది అతనేనా?

సార్వత్రిక ఎన్నికలకు ముందు కమలనాథుల మీద కస్సుమన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకోవటం తెలిసిందే. తమను ఇష్టమొచ్చినట్లుగా విమర్శలు చేసిన జనసేనాధిపతితో చేతులు కలపటమే కాదు.. ఎన్నికల్లో కలిసి పోరాడతామని చెప్పారు కమలనాథులు. ఇంతకీ బీజేపీ.. జనసేన మధ్య పొత్తుకు చక్రం తిప్పిందెవరు? ఎవరి కారణంగా ఈ రెండు పార్టీల మధ్య సయోద్య నడిచింది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బీజేపీ.. జనసేన మద్య పొత్తుకు కారణం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎస్ సంతోష్ గా చెబుతున్నారు. కర్ణాటకలోని ఉడిపికి చెందిన సంతోష్ దీర్ఘకాలంగా సంఘ్ లో పని చేశారు. అప్పట్లో బీజేపీ నుంచి బయటకు వెళ్లిన యడ్డీ కారణంగా కర్ణాటక బీజేపీని నడిపించింది ఆయనే. భార్యపిల్లలు లేని అతనికి మీడియా ముందుకు రావటం.. ఫోటోలు దిగటం లాంటివి అస్సలు ఇష్టముండదట. ఎంతసేపు పార్టీ ప్రయోజనాలు తప్పించి మరింకేమీ పట్టవని.. పార్టీ కోసం ఎంతో కమిట్ మెంట్ తో పని చేస్తారని చెబుతారు.

పుస్తకాలు బాగా చదివే సంతోష్ కు పర్యావరణం.. చైనాతో సంబంధాలు.. రక్షణ..సైద్ధాంతిక భిన్నత్వం లాంటి అంశాల పట్ల ఆసక్తి ఎక్కువని చెబుతారు. గడిచిన పదేళ్ల కాలంలో ఈశాన్య రాష్ట్రాలతో పాటు.. గోవా.. తమిళనాడు.. కేరళలో పార్టీని బలోపేతం చేసే మిషన్ లో కీలకభూమిక పోషిస్తుంటారు. ఏపీలో ఉన్న భిన్న రాజకీయ వాతావరణాన్ని గుర్తించిన ఆయన.. బీజేపీని బలోపేతం చేయటం.. జనసేన పోరాట పటిమను మరింత పెంచేందుకు వీలుగా పొత్తు అనివార్యమని గుర్తించటమే కాదు.. పవన్ ను ఆ దిశగా ఒప్పించినట్లుగా చెబుతారు.

సంతోష్ లో మరో ఆసక్తికర కోణం ఏమంటే.. ఆయన కన్నడ.. తుళుతో పాటు ఇంగ్లిషు.. హిందీ.. తమిళం కూడా మాట్లాతారు. రానున్న రోజుల్లో తెలుగు మాట్లాడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో? తనకిచ్చిన టాస్క్ ను అనుకున్న సమయానికి పూర్తి చేసే వ్యక్తిగా పేరున్న ఆయనకు తాను ఫోకస్ చేసే రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలోనూ సొంత నెట్ వర్క్ ఉందని చెబుతారు.

ఢిల్లీలో పవన్ కు నడ్డాకు మధ్య జరిగిన భేటీ సమయంలోనూ ఆయన అక్కడే ఉన్నారు. బీజేపీ.. జనసేన మధ్య పొత్తు వెనుక ఉన్నది ఎవరన్న విషయాన్ని సంతోష్ కు అత్యంత సన్నిహితుడు.. ఆయన శిష్యుడైన మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా సోషల్ మీడియాలో పేర్కొనటం గమనార్హం. అంతేకాదు.. 2024లో పవన్ ఏపీ సీఎం అవుతారన్న  ఆశాభావాన్ని వ్యక్తం చేయటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English