నిర్మలాసీతారామన్ ప్లేసులో కొత్త ఆర్థిక మంత్రి ఎవరో తెలుసా?

నిర్మలాసీతారామన్ ప్లేసులో కొత్త ఆర్థిక మంత్రి ఎవరో తెలుసా?

సీఏఏ, పాకిస్తాన్, కాంగ్రెస్, జేఎన్‌యూ.... వీటన్నిటిలో మోద ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నదేమిటని ప్రశ్నిస్తే... దిల్లీ రాజకీయవర్గాల నుంచి వస్తున్న సమాధానం నిర్మలా సీతారామన్. అవును... వీటన్నిటికంటే నిర్మలా సీతారామన్ మోదీ ప్రభుత్వాన్ని తెగ ఇబ్బంది పెడుతున్నారన్న సమాధానం వస్తోంది. ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్న దేశాన్ని బయటపడేయలేకపోతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామనే మోదీ ప్రభుత్వాన్ని తెగ ఇబ్బంది పెడుతున్నారన్న సమాధానం వినిపిస్తోంది.

నిజానికి నిర్మల సమర్థవంతమైన మంత్రి. కానీ, పరిస్థితులను మార్చడంలో ఆమె చేపట్టిన చర్యలేమీ ఫలితమివ్వడంలేదు. దీంతో మోదీ ఈ ఇబ్బందిని అధిగమించడానికి కీలక నిర్ణయం తీసుకున్నారని.. బడ్జెట్ అనంతరం ఆర్థిక మంత్రి పదవి నుంచి నిర్మలా సీతారామన్‌ను తప్పించాలనుకుంటున్నారని దిల్లీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

జీడీపీ, ఐఐపీలాంటి సూచికలు పడిపోయినప్పుడల్లా తెరపైకి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చి ఆ పరిస్థితులకు దారితీసిన అంశాలను వివరిస్తారు. ఇక దేశ ఆర్థిక వ్యవస్థపై ఇటు విపక్షాలు అటు ఆర్థిక నిపుణులు విమర్శలు సంధిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ఫిక్స్ చేసేందుకు పలువురు ఆర్థిక నిపుణులతో సమావేశం అవుతున్నారట. ఈ నేపథ్యంలోనే ఆయన తాను సమావేశమైన వ్యక్తుల్లోంచి ఒకరి పట్ల ఫిదా అయ్యారని.. ఆయన రాజకీయాల్లో లేకున్నా సరే ఆయన్ను ఫైనాన్స్ మినిస్టర్‌ను చేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.

దీంతో ఈ ఏడాది బడ్జెట్‌ను నిర్మలా ప్రవేశపెట్టినా కూడా అనంతరం ఆమెను మార్చి కొత్త వ్యక్తికి ఆర్థిక శాఖ బాధ్యతలు ఇవ్వాలనుకుంటున్నారట. అది కూడా ఇంతవరకు రాజకీయాల్లో లేని ఓ కార్పొరేట్ దిగ్గజాన్ని ఆ పదవిలోకి తేబోతున్నట్లు వినిపిస్తోంది. మన్మోహన్ సింగ్ ఎలా అయితే ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఆర్థిక శాఖ మంత్రి అయ్యారో అదే తరహాలో దేశానికి ఇప్పుడో కొత్త రాజకీయేతర వ్యక్తిని ఆర్థిక మంత్రిని చేయడానికి మోదీ రెడీ అవుతున్నట్లు వినిపిస్తోంది.

ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చీఫ్ కేవీ కామత్‌‌ను నిర్మల స్థానంలో ఆర్థిక మంత్రిని చేస్తారన్న ప్రచారం ఒకటి దిల్లీ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే మోదీ ఆయనతో భేటీ అయ్యారని.. ఆ క్రమంలోనే ఆయన ఆలోచనలు నచ్చి ఆయన్నే మంత్రిని చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ ఏమీ బాగోలేదు. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలంటే ప్రభుత్వం కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకులకు సంబంధించిన ఎన్‌పీఏలపై ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఎన్‌బీఎఫ్‌సీలను కూడా డీల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆర్థిక శాఖ మంత్రిగా కామత్ ఈ నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది అనుమానమే. ఈ సలహాను గతంలోనే తాను ప్రధాన ఆర్థిక సలహాదారుడిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి చెప్పినట్లు అరవింద్ సుబ్రహ్మణ్యన్ వెల్లడించారు. అయితే నష్టాల ఊబిలో కూరుకుపోయిన బ్యాంకులను నిలబెట్టాలంటే బాండ్ ద్వారానే ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం కొన్ని ఖర్చులను, సబ్సీడీలపై కోత విధించాల్సి ఉంటుంది. అయితే ఇందుకు ప్రధాని మోడీ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇవన్నీ నిర్ణయమయ్యాకే ఆయన్ను ఆర్థిక మంత్రిని చేస్తారా.. లేదంటే ఆర్థిక మంత్రిని చేసి ఆయన్నూ తన అదుపాజ్ఞల్లో ఉంచుకుంటారో వేచి చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English