బాబు లాంటోళ్లందరికీ ఎందుకీ షాక్?

బాబు లాంటోళ్లందరికీ ఎందుకీ షాక్?

టీడీపీ అధినేత.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును చూసినంతనే.. ఆయన కంటే కూడా ఆయన పక్కన పెద్ద ఎత్తున ఉండే బ్లాక్ క్యాట్ కమాండోలు అమితంగా ఆకర్షిస్తుంటారు. ఒంటి మీద బ్లాక్ డ్రెస్ తో పాటు.. డేగ కళ్లతో.. అనుక్షణం చురుగ్గా ఉండే ఈ భద్రతా దళం ఇకపై బాబు వెంట కనిపించరు. చంద్రబాబుతో పాటు.. ఆయన లాంటి వీవీఐపీలకు షాకిచ్చేలా ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలోని పలువురు వీవీఐపీల రక్షణ బాధ్యతల్ని తీసుకున్న బ్లాక్ క్యాట్ కమాండోలను ఉపసంహరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

బాబుతోపాటు.. ఆయన మాదిరే మరో 13 మంది ప్రముఖులకు ప్రస్తుతం 450 మంది బ్లాక్ క్యాట్ కమాండోలు రక్షణ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఇకపై వారంతా ప్రత్యేక ఆపరేషన్ల కోసం ఉపయోగించాలని భావిస్తున్నారు. వీరిని ఏ ఉద్దేశం కోసం సిద్దం చేశారో.. వాటి కోసం కాకుండా దేశ వ్యాప్తంగా వీవీఐపీలకు భద్రత కోసం ప్రస్తుతం వినియోగిస్తున్నారు. ఇలాంటి వారిని ప్రముఖుల భద్రతా విధుల నుంచి తొలగించాలన్న ఏళ్ల నాటి ప్రతిపాదనకు మోడీ సర్కారు తాజాగా ఓకే చెప్పేసింది.

ఒకే సమయంలో పెద్ద ఎత్తున దాడులకు వినియోగించాలంటే బ్లాక్ క్యాట్ కమాండోల కొరతను ఎదుర్కొంటున్నారు. అందుకే.. ఇలాంటి వారిని ప్రత్యేక ఆపరేషన్లకు మాత్రమే ఉపయోగించాలని.. ప్రముఖుల భద్రతను కేవలం ఎస్ ఎస్ జీకి పరిమితం చేయాలన్న కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ మధ్యన మాజీ ప్రధాని మన్మోహన్ తో పాటు.. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ కుటుంబాలకు ఎస్పీజీ రక్షణ నుంచి జాతీయ భద్రతా దళాల్ని వినియోగిస్తున్నారు. మోడీ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం బాబు లాంటి వీవీఐపీలకు ఏ మాత్రం మింగుడుపడని రీతిలో ఉంటుందని చెప్పక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English