మ‌ఠంలో మ‌త రాజ‌కీయం..మోదీపై హిందూ పెద్ద ఫైర్‌

మ‌ఠంలో మ‌త రాజ‌కీయం..మోదీపై హిందూ పెద్ద ఫైర్‌

ఔను. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మ‌ఠంలో మ‌త రాజ‌కీయాలు చేశార‌ట‌. దీన్ని సాక్షాత్తు హిందూ పెద్దాయ‌నే త‌ప్పుప‌ట్టారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం బెంగాల్‌లో ఉన్న ఆయన..  వివేకానంద 150వ జయంత్యుత్సవాల సందర్భంగా కోల్‌క‌తాలోని రామకృష్ణ మిషన్‌ ప్రధాన కార్యాలయం బేలూరు మఠ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్ర‌ధాన‌మంత్రి పాల్గొన్నారు.  పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వల్ల దేశంలో ఏ ఒక్కరి పౌరసత్వాన్నీ రద్దు చేయబోమని ప్రధాని మోడీ అన్నారు. అయితే, బేలూరు రామకృష్ణ మఠం వేదికగా ఆదివారం  ప్రధాని మోడీ చేసిన ప్రసంగంపై రామకృష్ణ మిషన్ ప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతమైన ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో వివాదాస్పద రాజకీయాలను మాట్లాడటం తమను చాలా బాధ కలిగించిందని మిషన్ సభ్యుడు గౌతమ్ రాయ్ అన్నారు.

'సీఏఏ ద్వారా ఎవ్వరి పౌరసత్వాన్ని రద్దు చేయబోమని నేను మరోసారి స్పష్టం చేస్తున్నాను. స్వాతంత్య్రానంతరం గాంధీ మహాత్మా óతో పాటు ఆనాటి నాయకులు పాక్‌లో పీడితులుగా ఉన్న హిందువులకు పౌరసత్వం ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీలు యువతను తప్పుదారి పట్టిస్తున్నాయి' అని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. సీఏఏ తీసుకొచ్చిన తర్వాతే పాక్‌, బంగ్లా, అఫ్ఘన్‌లలో హిందువులు హింసకు గురవుతున్నారని విషయం అందరికీ తెలిసిందని చెప్పుకొచ్చారు. సీఏఏ ద్వారా ఈశాన్య రాష్ట్రాల ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ఎలాంటి భంగం వాటిల్లబోదని స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు.

దీనిపై మిషన్ సభ్యుడు గౌతమ్ రాయ్ స్పందిస్తూ, “రామకృష్ణ మఠానికి ఓ పవిత్రత ఉంది, ఇక్కడ రాజకీయ స్వభావంతో కూడిన ప్రకటనలు చేయడానికి ఎలాంటి అనుమతి లేదు, ప్రధాని మోడి దానిని ఉల్లంఘించారు. నా పరిశీలన మేరకు RSS సంబంధాలున్న సీనియర్ అధ్యాత్మిక గురువుల ప్రోత్సాహంతో గత కొన్నేళ్లుగా రామకృష్ణ మఠం బాగా రాజకీయమైంది. మోడీ పర్యటన కూడా  అందులో భాగమే” అని రాయ్ ఓ జాతీయ మీడియా సంస్థతో అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English