ఆంధ్రజ్యోతే ఫ్రంట్‌ పేజీలో రాసి నన్ను ఇబ్బంది పెట్టింది

ఆంధ్రజ్యోతే ఫ్రంట్‌ పేజీలో రాసి నన్ను ఇబ్బంది పెట్టింది

కొన్ని మాటలు లక్షల మందితో.. ఆ మాటకు వస్తే కోట్ల మందితో మాట్లాడేయొచ్చు. కానీ.. ఎవరి గురించైతే అంతమందితో మాట్లాడామో.. అదే వ్యక్తి ఎదురైనప్పుడు.. అదే మాటల్ని మాట్లాడటం ఇబ్బందే. తాజాగా అలాంటి పరిస్థితిని తనకు తగ్గట్లుగా వ్యవహరించిందో మీడియా సంస్థ. సీఎంగా కేటీఆర్ పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో భారీ కథనం ఒకటి పబ్లిష్ అయ్యింది. దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.

తాజాగా అదే సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు మంత్రి కేటీఆర్ ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తో సదరు మీడియా సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు ఇంటర్వ్యూ చేస్తూ.. మధ్యలో ఇంతకూ మీ పట్టాభిషేకం ఎప్పుడు? అన్న ప్రశ్నను సంధించారు.

రాజకీయంగా తనను ఇరుకున పెడుతున్న పరిస్థితికి కారణమైన మీడియా సంస్థకు చెందిన ప్రతినిధే స్వయంగా ప్రశ్నను సంధించటంతో మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. కాస్తంత ఎటకారం.. మరికాస్త మంట పుట్టేలా వ్యంగ్య వ్యాఖ్య చేశారు. ఇంతకూ కేటీఆర్ సమాధానం ఆయన మాటల్లోనే చూస్తే.. ''ఆంధ్రజ్యోతే ఫ్రంట్‌ పేజీలో రాసి నన్ను ఇబ్బంది పెట్టింది. నాకు తెలియదు. మీకే తెలియాలి. ముహూర్తాలు, తేదీలు మీరే ఖరారు చేస్తున్నారు. పతాక శీర్షికల్లో వార్తలు మీరే ప్రచురిస్తున్నారు. అది కూడా మీరే చెబితే అయిపోతుంది'' అంటూ బదులిచ్చారు.

మరి.. కేటీఆర్ సీఎం కావాలంటూ మంత్రులు పలువురు చేస్తున్న వ్యాఖ్యల వెనుక అసలు విషయాన్ని కేటీఆర్ చెప్పేశారు. ప్రెస్ మీట్ లో ఈ ప్రశ్నను సంధించటంతో సదరు మంత్రులు రియాక్ట్ అవుతున్నారే తప్పించి.. ఏ మంత్రి కూడా తనకు తానుగా వ్యాఖ్యానించటం లేదని.. నిజానికి తమ మంత్రులు అలా మాట్లాడే సందర్భం ఉంటుందని తాను అనుకోవటం లేదన్నారు. మరో ప్రశ్నకు బదులిస్తూ.. తన సోదరి కవిత మరోసారి ప్రజాక్షేత్రం నుంచి గెలుపొందుతుందంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English