ఏపీ కుప్పకూలే పరిస్థితుల్లో ఉంది - రేవంత్ రెడ్డి

ఏపీ కుప్పకూలే పరిస్థితుల్లో ఉంది - రేవంత్ రెడ్డి

మూడు రాజధానుల ప్రకటన తర్వాత ఏపీలో ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలు నిరసనలు పెల్లుబికాయి. వైసీపీ తప్ప ఇతర అన్ని పార్టీలు అమరావతికే మద్దతు పలకడం, రైతులకు అండగా నిలవడంతో ఆందోళనలు మరింత పెరిగాయి.

మొదటి అమరావతిలో మాత్రమే కనిపించిన నిరసనలు, ర్యాలీలు చంద్రబాబు టూర్లతో ఇతర జిల్లాల్లోనూ కనిపిస్తున్నాయి. మరోవైపు కాకినాడలో నేడు జరిగిన జనసేన - వైసీపీ కార్యకర్తల పరస్పర దాడులు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ పరిస్థితులపై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఆసక్తికరంగా స్పందించారు.

"ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రేయస్సు కోసం సోదర రాష్ట్రంలో చిచ్చుపెట్టారు. ఏపీలో పరిస్థితుల వల్ల తెలంగాణలో భూముల ధరలు పెరిగాయి. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులకు హైదరాబాదే సేఫ్ అనిఏపీ ప్రజలు ఫీలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఇవి ఒక తెలంగాణ వక్తిగా నాకు సంతోషాన్ని కలిగిస్తున్నా... ఒక భారతీయుడిగా ఏపీ పరిస్థితులను చూసి బాధపడుతున్నాను. ఏపీ కుప్పకూలే పరిస్థితిలో ఉంది." అని ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇటీవలే కేటీఆర్ కూడా ఏపీ గురించి స్పందించారు. ఆయనంతట ఆయన స్పందించకపోయినా.. ఆస్క్ కేటీఆర్ ప్రోగ్రామంలో ఏపీ రాజధాని గురించి ఒక నెటిజన్ వేసిన ప్రశ్నకు అది ఏపీ ప్రజలు నిర్ణయించుకుంటారు, దానిని తేల్చాల్సింది నేను కాదు అంటూ కేటీఆర్ లౌక్యంగా సమాధానం ఇచ్చారు.

అయితే, ఆ సందర్భంలో కేటీఆర్ మరోమాట కూడా అన్నారు. విడిపోతే తెలంగాణ పాడవుతుందాం అనుకున్నాం గాని సీన్ రివర్స్ లో ఉందని మరో నెటిజన్ చేసిన వ్యాఖ్యను కేటీఆర్ రీట్వీట్ చేస్తూ ఇది మా శ్రమ దక్కిన ఫలితం అన్న అర్థం వచ్చేలా కేటీఆర్ స్పందించారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English