రొమాంటిక్ చాట్.. దొరికిపోయిన 30 ఇయర్స్ పృథ్వీ?

 రొమాంటిక్ చాట్.. దొరికిపోయిన 30 ఇయర్స్ పృథ్వీ?

రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వాళ్లు తమ వ్యవహారాలపై కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఒకరిని వేలెత్తి చూపించాక, తీవ్ర విమర్శలు చేశాక.. వీళ్లు ఎక్కడ దొరుకుతారా అని ఎదురు చూస్తుంటుంది వైరి వర్గం. ఏ చిన్న అవకాశం దొరికినా అంతే సంగతులు. ఇప్పుడు జనసైనికులకు కమెడియన్ టర్న్డ్ పొలిటీషియన్ 30 ఇయర్స్ పృథ్వీ ఇలాగే దొరికిపోయాడు. ఎన్నికలకు కొన్నేళ్ల ముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుగా మారిన పృథ్వీ.. ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలే చేశాడు. ఆయన మూడు పెళ్లిళ్ల గురించి కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు.

ఐతే పృథ్వీ ఎప్పుడు దొరుకుతాడా అని జనసేన అభిమానులు ఎదురు చూస్తూ వచ్చారు. వాళ్లకు ఇప్పుడొక ఆడియో టేపు దొరికింది. అందులో పృథ్వీ శృంగార సంభాషణ బయటపడింది. ప్రస్తుతం పృథ్వీ ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఛానెల్లో పని చేసే కింది స్థాయి ఉద్యోగిని ట్రాప్ చేసే ప్రయత్నం చేశాడన్నది పృథ్వీ మీద ఆరోపణ. సదరు మహిళతో పృథ్వీ సంభాషణ తాలూకు ఆడియో టేపు ఒక టీవీ ఛానెల్‌కు దొరికింది. ఇందులో పృథ్వీ ఆమెను మెల్లగా లైన్లో పెట్టే ప్రయత్నం చేసిన వైనం స్పష్టంగా అర్థమవుతోంది.

''నిన్ను వెనుక నుంచి వాటేసుకుందాం అనుకున్నా.. కానీ నువ్వు కెవ్వుమని అరుస్తావేమో అని ఆగిపోయా''.. 'ఎందుకో తెలియదు నువ్వంటే నాకు చాలా ఇష్టం''.. ''మీ ఇంటికి వద్దామనుకున్నా''.. ''నేను మందు కొట్టడం మానేశా. నీ ముందు తాగాలని ఉంది. ఇద్దరం కలిసి తాగుదాం'' లాంటి కామెంట్లు చేశాడు పృథ్వీ. ఆడియోలో వినిపిస్తున్నది పృథ్వీ వాయిసే అని స్పష్టంగా తెలుస్తోంది. పృథ్వీ వ్యాఖ్యల్ని లైంగిక వేధింపులుగా పరిగణిస్తారా లేదా అన్నది పక్కన పెడితే.. తన కింద పని చేసే ఒక మహిళను ముగ్గులోకి దింపడానికి ఆయన ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. సదరు మహిళను పృథ్వీ ఇంతకుముందు ఏ రకంగా ఇబ్బంది పెట్టాడో ఏమో కానీ.. ఆమె అయితే ఆయన్ని బుక్ చేసే ఉద్దేశంతోనే సంభాషణను సాగించిన వైనమూ అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్‌పై పృథ్వీ చేసిన విమర్శల్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ఈ ఆడియోను జనసైనికులు సోషల్ మీడియాలో వైరల్ చేసే ప్రయత్నంలో పడ్డారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English