ఢిల్లీలో ఉండే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ప‌వ‌న్‌

ఢిల్లీలో ఉండే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ప‌వ‌న్‌

జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఢిల్లీ టూర్‌లో ఉన్న‌ప్ప‌టికీ రాష్ట్రంలోని ప‌రిణామాల‌పై ఘాటుగా స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి బూతులతో రెచ్చిపోయిన ఉదంతం క‌ల‌క‌లం రేకెత్తించిన సంగ‌తి తెలిసిందే.

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. అయితే, తాజాగా ప‌వ‌న్ దీనిపై స్పందించారు. అవ‌స‌ర‌మైతే, ఢిల్లీ నుంచి వ‌చ్చి ఆందోళ‌న చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

సభ్య సమాజం ఛీత్కరించుకొనే పదజాలంతో ప్రసంగం చేసిన ప్రజా ప్రతినిధి తీరుపై నిరసన తెలియచేస్తున్న జనసేన కార్యకర్తలు, నాయకులపై వైసీపీ కార్యకర్తలు రాళ్ళ దాడికి పాల్పడటం అత్యంత దురదృష్టకరమ‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. "ప్రజలచే ఎన్నుకోబడ్డ ఒక ప్రజా ప్రతినిధి బాధ్యత లేకుండా అసభ్యకరంగా మాట్లాడిన విధం చూసిన ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు.  తప్పుని తప్పు అని చెబుతున్నవారిపై అరాచక శక్తులతో దాడులు చేయిస్తే జన సైనికులు వెనకడుగు వేస్తారనుకోవద్దు. అధర్మాన్ని ఖండించడమే జనసేన విధానం. రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్న ఆ ప్రజా ప్రతినిధిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా పోలీసు యంత్రాంగాన్ని కోరేది ఒకటే పక్షపాతం లేకుండా ఇరు వర్గాలతో చర్చించి శాంతియుత పరిస్థితులు తీసుకురావాలి. మా జనసేన కార్యకర్తలకు, నాయకులకు అన్యాయం చేసి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తే ఢిల్లీ పర్యటన నుంచి నేరుగా కాకినాడకు వచ్చి వారికి బాసటగా ఉంటాను. రాళ్ళ దాడిలో గాయపడిన జన సైనికులు, నాయకులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రతి జన సైనికుడు వారికి ధైర్యాన్ని అందించి అండగా నిలవాలి. పవన్ కల్యాణ్,అధ్యక్షుడు, జనసేన" పేరుతో పార్టీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English