పృథ్వీ రాజీనామా...వెనుక ఇంత జ‌రిగింది మ‌రి!

పృథ్వీ రాజీనామా...వెనుక ఇంత జ‌రిగింది మ‌రి!

"నేను గుర్తుకు వస్తున్నానా? నువ్వంటే ఇష్టం.. నా గుండెల్లో ఉన్నావ్.. నిన్ను వెనక్కి నుంచి వచ్చి గట్టిగా కౌగిలించుకుందాం అనుకున్నా.. లవ్ యూ".. ఇలా ఓ మహిళా ఉద్యోగినితో ఎస్వీబీసీ చైర్మన్ పృథ్విరాజ్ మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. . సదరు మహిళా ఉద్యోగిని, పృథ్వీరాజ్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధిచిన ఆడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. తాజాగా, పృథ్వీరాజ్ రాజీనామా చేశారు. అయితే, దీని వెనుక అనేక ప‌రిణామాల చోటు చేసుకున్నాయి.

పృథ్వీ కామెంట్లు పెద్ద ఎత్తున వైర‌ల్ అయిన నేప‌థ్యంలో దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తక్షణం విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విచారణకు ఆదేశించడంతో విజిలెన్స్ పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎస్వీబీసీ కార్యాలయానికి వెళ్లిన టీటీడీ విజిలెన్స్ ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించారు. విజిలెన్స్ నివేదిక వచ్చిన తరువాత తదుపరి చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. అనంత‌రం టీటీడీ ఆయ‌న రాజీనామా చేస్తార‌ని ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

టీటీడీ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న ఇది. "ఎస్వీబీసీ చైర్మన్ పృథ్విరాజ్ ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడినట్టు కొన్ని ప్రసార మాధ్యమాల్లో ఆడియో ప్రసారాలు చేశారు. దీనిపై ఎస్వీబీసీ చైర్మన్ స్పందిస్తూ తనపై బురద చల్లేందుకు ఎవరో పనిగట్టుకొని తన స్వరాన్ని అనుకరించి ఆడియో రూపొందించారని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డికి నివేదించారు. ఈ విషయమై టీటీడీ చైర్మన్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఆడియోలోని వాయిస్ శాంపిల్‌ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి పూర్తిస్థాయిలో విచారణకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా పై విషయాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు తెలియజేయగా ఆయ‌న స్పందిస్తూ ఎస్వీబీసీ చైర్మన్ పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని పృథ్వీరాజ్ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు." అని ప్ర‌క‌ట‌నలో పేర్కొంది.


 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English