పోసాని ఎఫెక్ట్.. పృథ్వీపై వైసీపీ అధిష్ఠానం సీరియస్

పోసాని ఎఫెక్ట్.. పృథ్వీపై వైసీపీ అధిష్ఠానం సీరియస్

స్వామిభక్తి ఒక్కోసారి కొంప ముంచుతుంది.. కమెడియన్ నుంచి పొలిటీషియన్‌గా మారిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌కు అలాంటి పరిస్థితే ఎదురైంది. ఇటీవల ఆయన రాజధాని ప్రాంత రైతులు, మహిళలను పెయిడ్ ఆర్టిస్టులంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రైతుల స్థితి ఎలా ఉండాలో నిర్దేశించే కొన్ని మాటలన్నారు. వాటిపై పోసాని కృష్ణమురళి సీరియస్ కావడం, అది వైరల్ కావడం తెలిసిందే. దీంతో పృథ్వీ వ్యాఖ్యలు చేసినప్పుడు కంటే పోసాని ఫైరయిన తరువాత ఆ వ్యాఖ్యలు మరింతగా అందరికీ చేరిపోయాయి. దీంతో వైసీపీ పెద్దలు కూడా పృథ్వీ తీరుపై అసహనం వ్యక్తంచేసినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానం ఆయనపై సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. రైతులపై ఇష్టానుసారంగా మాట్లాడటంపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పృథ్వీపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు అధిష్టానం సిద్ధమవుతోందని వినిపిస్తోంది. కులాలను ప్రస్తావిస్తూ ఎవర్ని కించపర్చేలా మాట్లాడొద్దని అధిష్టానం ఆయన్ను ఆదేశించింది.

మెయిన్‌స్ట్రీమ్ రాజకీయ నేతేమీ కాని పృథ్వీ తనకిచ్చిన పదవి వరకు పని చేసుకుంటూ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సహకరిస్తే చాలని.. అంతేకానీ, ఇలా మహిళలను, కులాలను, రైతులను కించపరిచేలా పరిధి దాటి మాట్లాడితే అనవసరంగా ఇబ్బందులు వస్తాయని ఆయన్ను మందలించినట్లుగా చెబుతున్నారు. ప్రధాన స్రవంతి నేతలు ఏం మాట్లాడినా కొంతవరకు డిఫెన్సు చేసుకోగలరని.. కానీ, సినీ రంగం నుంచి పృథ్వి ఇలా హద్దులు దాటితే ఆ రంగానికి చెందిన వ్యక్తులు, అక్కడున్న ఆయన వ్యతిరేకులు స్పందించడం ప్రారంభిస్తే ప్రభుత్వం ఇరుకునపడుతుందని పార్టీ పెద్దలు అభిప్రాయపడినట్లుగా చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English