అమరావతికే 'జై'... .మూడు రాజధానులు సాధ్యం కావు

అమరావతికే 'జై'... .మూడు రాజధానులు సాధ్యం కావు

ఆంధ్రప్రదేశ్ పునర్విభజనలో కీలక పాత్ర పోషించని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ ఏపీలో ప్రస్తుత పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనలపై ఆయన స్పందించారు.  ఏపీ రాజధాని విషయంపై కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుందని.. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించిన తరువాతే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా స్పందిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

అమరావతి రాజధానిపై స్పందించేందుకు నిరాకరించిన జైరాం.. మీడియా చిట్‌చాట్‌లో మాత్రం తన అభిప్రాయాలను వెల్లడించారు. మూడు రాజధానుల అంశం సాధ్యమయ్యే పని కాదని ఆయన కుండబద్ధలు కొట్టారు. ఇప్పుడు ఉన్న చోటే ఏపీ రాజధానికి అనుకూలమైన ప్రాంతమని ఆయన వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయాలు వేర్వేరు చోట్ల ఉండడం సాధ్యం కాదని ఆయన అన్నారు. గతంలో మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు కూడా అది రుజువైందన్న జైరాం.. 1953లో కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలో గుంటూరులో హైకోర్టు సాధ్యపడలేదని ఆయన గుర్తు చేశారు.

అయితే అమరావతి రైతులు ఆందోళనలు.. రాజధాని తరలింపు పై కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుందని జైరాం రమేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తరువాతే తమ అభిప్రాయం వెల్లడిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన జైరాం రమేష్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

విభజన సమయంలో ఏపీ రాజధానిపై అధ్యయనానికి నియమించిన శివరామకృష్ణ కమిటీ కూడా రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలని సూచించినట్లు ఆయన చెప్పారు. మూడు రాజధానుల అంశం సాధ్యమవతుందని తాను అనుకోవడం లేదని జైరాం అభిప్రాయపడ్డారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English