జాతకాల పిచ్చితోనే జగన్ రాజధానిని మారుస్తున్నారట

జాతకాల పిచ్చితోనే జగన్ రాజధానిని మారుస్తున్నారట

ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి రాష్ట్ర రాజధానిని మార్చే దిశగా కదులుతుండడంపై అంతటా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా మాజీ మంత్రి జవహర్ ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ జాతకాల పిచ్చితోనే రాజధానిని మార్చుతున్నారని.. విశాఖ శారదాపీఠం స్వామి స్వరూపానందేంద్ర ఆలోచనతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు.

సీఎం జగన్ కు జాతకాల పిచ్చి పట్టిందని జవహర్ అన్నారు. జగన్ జాతకాల పిచ్చితో ఇటు హిందువులను, అటు క్రైస్తవులను మోసం చేస్తున్నారని విమర్శించారు. జగన్ రాజధానిని విశాఖకు మార్చుతుండడం వెనుక స్వరూపానంద సరస్వతి సలహా ఉండొచ్చని సందేహం వ్యక్తం చేశారు.

జగన్ జాతకాల పిచ్చితో ఐదు కోట్ల మంది ప్రజలను కష్టాల్లోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, మరికొన్నిరోజుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగన్ భేటీ అవుతుండడం పట్ల జవహర్ స్పందించారు. హైదరాబాద్ కు మేలు చేసే మరో ఒప్పందం కుదుర్చుకునేందుకే కేసీఆర్ తో సమావేశమవుతున్నారని ఆరోపించారు.

రాజధాని రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వ విప్ పిన్నెల్లిపై దాడి జరగడం, టీడీపీ నేతల అరెస్టు తదితర పరిణామాలపైనామాజీ మంత్రి కేఎస్ జవహర్ ఘాటుగా స్పందించారు. రైతులు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే కుట్రపూరితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడికి వచ్చారని ఆరోపించారు.

బూతులు మాట్లాడడంలో పిన్నెల్లి మంత్రి కొడాలి నానిని మించిపోయారంటూ ఎద్దేవా చేశారు. అందుకే పిన్నెల్లి నోరు కడుక్కోవడానికి యాసిడ్ పంపిస్తానని అన్నారు. అధికార పార్టీ నేతలు బూతులు మాట్లాడడం మానేసి బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు చేయకుండా మాచర్ల నియోజకవర్గంలో ప్రజలను పీడిస్తున్నారని మండిపడ్డారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English