ప‌వ‌న్ స్పెష‌ల్ ఫోక‌స్‌, జేడీ, రాపాకాకు బాధ్య‌త‌లు

ప‌వ‌న్ స్పెష‌ల్ ఫోక‌స్‌, జేడీ, రాపాకాకు బాధ్య‌త‌లు

జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ కార్య‌క్ర‌మాల‌ను మ‌రింత ఉధృతం చేస్తున్నారు. గ‌త కొంత‌కాలంగా రాజ‌ధాని అంశంపైనే దృష్టి సారిస్తూ వ‌చ్చిన జ‌న‌సేనాని తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీపైనా ఫోక‌స్ చేశారు. ఈ మేర‌కు వివిధ‌ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జీల‌ను నియ‌మించారు. అసెంబ్లీ, పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా బాధ్యుల‌ను ఎంపిక చేశారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌త్యేకంగా ఉత్త‌రాంధ్ర‌పై ఫోక‌స్ చేశారు.

గ‌త కొంత‌కాలంగా పార్టీకి పంటికింద రాయిలా మారిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌కు సైతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రాధాన్య‌త క‌ల్పించారు. దీంతోపాటుగా ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌కు సైతం బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ప‌లు జిల్లాల్లోని వివిధ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జీల‌ను నియ‌మించడంతో పాటుగా ఉత్తరాంధ్రలో పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణకు అయిదుగురు సభ్యులతో సమన్వయ కమిటీని నియమిస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమన్వయ కమిటీలో టి.శివశంకర్, మేడా గురుదత్, సుజాత పండా, బొమ్మిడి నాయకర్, వై.శ్రీనివాస్ సభ్యులుగా ఉంటారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం రూరల్ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలను ఈ కమిటీ సమన్వయం చేస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.  రాష్ట్రంలోని పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇంచార్జులను నియమించారు.

* విశాఖపట్నం జిల్లా
విశాఖపట్నం పార్లమెంట్ ఇంచార్జ్ - వి.వి.లక్ష్మీనారాయణ
విశాఖపట్నం నార్త్ - పి.ఉషాకిరణ్
గాజువాక - కోన తాతారావు
భీమిలి -  పంచకర్ల సందీప్
అనకాపల్లి అసెంబ్లీ - పరుచూరి భాస్కర రావు
ఎలమంచిలి - సుందరపు విజయకుమార్
చోడవరం - పి.వి.ఎస్.ఎన్.రాజు
అరకు పార్లమెంట్ ఇంచార్జి : పి.గంగులయ్య

* తూర్పుగోదావరి జిల్లా
కాకినాడ పార్లమెంట్ ఇంచార్జి - పంతం నానాజీ
పిఠాపురం - మాకినీడు శేషుకుమారి
పెద్దాపురం - తుమ్మల రామస్వామి
కాకినాడ సిటీ - ముత్తా శశిధర్
జగ్గంపేట - పాటంశెట్టి సూర్యచంద్ర రావు
పత్తిపాడు - వరుపుల తమ్మయ్య బాబు
అమలాపురం పార్లమెంట్ ఇంచార్జి - డి.ఎం.ఆర్. శేఖర్
అమలాపురం అసెంబ్లీ - శెట్టిబత్తుల రాజబాబు
ముమ్మిడివరం -  పితాని బాలకృష్ణ
రామచంద్రపురం - పోలిశెట్టి చంద్రశేఖర్
రాజోలు -  రాపాక వరప్రసాద్
పి.గన్నవరం - పాముల రాజేశ్వరి
కొత్తపేట -  బండారు శ్రీనివాస్
మండపేట - వేగుళ్ల లీలాకృష్ణ
రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జి -  కందుల దుర్గేష్
అనపర్తి - మర్రెడ్డి శ్రీనివాస్
రాజమండ్రి సిటీ -  అత్తి సత్యనారాయణ
రాజానగరం -  రాయపురెడ్డి ప్రసాద్
రాజమండ్రి రూరల్ - కందుల దుర్గేష్

* గుంటూరు జిల్లా
గుంటూరు పార్లమెంట్ ఇంచార్జి: బోనబోయిన శ్రీనివాస యాదవ్
గుంటూరు వెస్ట్  - తోట చంద్రశేఖర్
గుంటూరు ఈస్ట్ - షేక్ జియా ఉర్  రెహమాన్
రేపల్లె -  కమతం సాంబశివ రావు
మంగళగిరి -  చిల్లపల్లి శ్రీనివాస్
తెనాలి -  నాదెండ్ల మనోహర్
సత్తెనపల్లి -  వై.వెంకటేశ్వర రెడ్డి
నరసరావు పేట:  సయ్యద్ జిలానీ

* చిత్తూరు జిల్లా
పీలేరు -  బి. దినేష్
మదనపల్లి - గంగారపు స్వాతి
శ్రీకాళహస్తి -  వినుత నగరం
తిరుపతి - కె. కిరణ్ రాయల్
కుప్పం - డా. ఎం. వెంకటరమణ
గంగాధర నెల్లూరు - డా.పొన్న యుగంధర్

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English