కేటీఆర్‌లో ఎంత మార్పు...

కేటీఆర్‌లో ఎంత మార్పు...

టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు విప‌రీత‌మైన దైవ‌భ‌క్తి అనే విష‌యం తెలిసిందే. కానీ ఆయ‌న త‌న‌యుడైన పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అందుకు పూర్తి భిన్నం. వారిద్ద‌రికీ దైవ‌భ‌క్తి, దైవారాధ‌న విష‌యంలో ఎంత‌గా తేడా ఉంటుందంటే... కేబినెట్ మంత్రులుగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తున్న‌పుడు సీఎం కేసీఆర్‌తో పాటు మిగ‌తా అమాత్యులంతా దైవ సాక్షిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తే కేటీఆర్ మాత్రం ఆత్మ‌సాక్షిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు!! ఇదే క్ర‌మంలో కేసీఆర్ చేసే యాగాలు, పూజ‌ల‌కు కేటీఆర్ పూర్తి దూరంగా ఉంటారు. ఇలాంటి వ్య‌క్తిత్వ‌మున్న కేటీఆర్ తాజాగా తిరుమ‌ల‌లో ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ కుటుంబసమేతంగా తిరుమలకు చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో కేటీఆర్‌కు ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, దుర్గాప్రసాద్‌, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. కేటీఆర్‌ కుటుంబసమేతంగా సోమవారం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.

కాగా, యాగాలు, ముహూర్త బలానికి అనుగుణంగా త్వరలోనే కేసీఆర్ వారసుడికి బాధ్యతలు అప్పగిస్తారని కేడర్‌లో చర్చ జరుగుతోంది. జనవరి చివరివారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో యాదాద్రిలో మరో భారీ యాగం చేపట్టేందుకు సీఎం సిద్ధమవుతున్నారు. యాగం తర్వాత అదే నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయని, అప్పుడే కేటీఆర్‌కు పట్టాభిషేకం జరగొచ్చని అంటున్నారు. ఇందుకోస‌మే కేటీఆర్ సైతం భ‌క్తి మార్గం ప‌ట్టార‌ని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English