కాంగ్రెస్ మరీ అంత దిగజారుడా?

కాంగ్రెస్ మరీ అంత దిగజారుడా?

దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా దిగజారనంత స్థాయికి కాంగ్రెస్ దిగజారి పోయింది.  తన ప్రభుత్వాన్నే కోమా లోకి తోసి అక్కడ రాష్ట్రపతి పాలన విదించే పరిస్థితికి దిగజారింది.  మూర్ఖుడైనా సరే తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కోడు, అలాంటిది ఎందరో మేధావులున్నారని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే పని చేసింది .ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించేసింది.  ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, రాష్ట్రపతి పాలన విదించడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితికి కాంగ్రెస్ దిగజారింది. తమ పార్టీ ముఖ్యమంత్రి రాజీనామా చేసి పార్టీని ధిక్కరించినా కూడా ఆయనను ఏమి చేయలేకపోయింది, ఆయన స్థానంలో మరొకరిని ముఖ్యమంత్రిగా నియమించలేక పోయింది. దీంతో తప్పని సరిగా రాష్ట్రపతి పాలన విధించాల్సివచ్చింది. ముఖ్యమంత్రి రాజీనామా చేసి పది రోజులు గడిచి పోయినా కూడా ఆ స్థానంలో అంత పెద్ద పార్టీకి  తగిన నాయకుడు దొరకకపోవడం. అంతే కాదు ఎవరో ఒకరిని పెడతామన్నా కూడా సమయం లేకుండా చేసుకోవడం దాని చేతకాని తనానికి నిదర్శనం.

ముఖ్యమంత్రి రాజీనామా చేస్తానని, మరో పార్టీ పెడుతారని ఎప్పటి నుంచో అంటున్నారు. అంతే కాదు సిడబ్ల్యూసి లో తెలంగాణ ప్రకటించిన తర్వాత సిఎం కిరణ్ అధిష్టానాన్ని అనకూడని మాటలు అన్నారు. ఆనాడే ఆయన రాజీనామా చేస్తారని కూడా వార్తలు వెలుబడ్డాయి. అయినా ఆయన తన ప్రయోజనాల కోసం పదవిని పట్టుకుని వేలాడుతుంటే  ఎలాంటి చర్య తీసుకోలేని దుస్థితికి దిగజారిపోయింది కాంగ్రెస్. ఆనాటి నుంచి ముఖ్యమంత్రి కిరణ్ ఏనాడు అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ప్రకటన చేయలేదు, ఎప్పుడు అవకాశం వచ్చినా దుమ్మెత్తి పోసారు.

అయినా కూడా ఆ పార్టీ ఆయననే తమ ముఖ్యమంత్రిగా కొనసాగించింది. ఈ విషయంలో ఎన్నో విమర్శలు వచ్చినా, నేరుగా దిగ్విజయ్ వంటి పెద్దలను తిట్టినా కూడా సిఎం కిరణ్ మంచోడు, ఆయన మాటల్లో తప్పులేదు అంటూ ఉమ్మేసిన చోట తుడుచుకున్నారు తప్ప ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ ఉండడం దారుణం. అంతే కాదు చివరకు సిఎం కిరణ్ తనకు తాను రాజీనామా చేసి వెళ్లిపోయారే కాని కాంగ్రెస్ తొలగించలేకపోయింది. ఇంత కంటే దిగజారుడుతనం  మరోటి ఉంటుందా. కనీసం రెండు నెలల క్రితం సిఎం ను తొలగించినా కూడా మరొకరిని నియమించి ప్రభుత్వాన్ని నడిపించుకునే అవకాశం కాంగ్రెస్ కు ఉండేది, కనీసం ఆ పని కూడా చేయలేకపోయింది.

ఇదంతా కాంగ్రెస్ వ్యూహ కర్తల వైఫల్యమని చెప్పక తప్పదు. ఏ తిరకాసు వచ్చినా చకచకా ఏపి నేతలను ఢిల్లీ పిలిపించడం, వారిని మార్చి వీరిని, వీరిని మార్చి వారిని పెడుతున్నారని నానా హంగామా సృష్టించడం, వార్ రూం లోకి వెళ్లడం వ్యూహకర్తలమని చెప్పుకునే ఓ నలుగురు కోర్ కమిటి సభ్యులు ఏదో చర్చించడం బయటకు రావడం, చివరకు ఏమి చేయక తుస్సు మనిపించడం ఎన్ని సార్లు జరిగిందో చెప్పలేం. చివరకు అన్ని కోర్ కమిటీ మీటింగులు పెట్టి ఏం చేసారు అంటే  సీమాంద్రలో పార్టీని పాతరేసారు. తెలంగాణలో కూడా మంచిగా ఉన్న పరిస్తితిని గబ్బు చేసుకోబోతున్నారు. పార్టీ కీలకనేత జైరాంరమేష్ మాట్లాడుతూ కనీసం మరో 15 సంవత్సారాలు సీమాంద్రలో పార్టీ కోలుకోదని, పొరపాటు చేసామని బహిరంగంగా చెప్పడం దీనికి ఉదహరణ. ఇలా ఎన్నో తప్పులు చేసి తన ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టుకోవాల్సిన దుస్థితికి దిగజారింది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English