గంటా శ్రీ‌నివాస‌రావు..కొంత క్లారిటీ..ఇంకొంత ఆందోళ‌న‌

గంటా శ్రీ‌నివాస‌రావు..కొంత క్లారిటీ..ఇంకొంత ఆందోళ‌న‌

టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎట్ట‌కేల‌కు త‌న కేంద్రంగా జ‌రుగుతున్న ప్ర‌చారంపై నోరు విప్పారు. గ‌త కొద్దిరోజులుగా,  గంటా శ్రీనివాసరావు వైఖ‌రితో ఆయ‌న పార్టీ మారతారంటూ పెద్ద ఎత్తున‌ వార్తలు వస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఆ ప్ర‌చారాన్ని కొట్టిపారేశారు. ఇంతేకాకుండా కీల‌క‌మైన రాజ‌ధాని విష‌యంలోనూ స్పందించారు. రాజధానిని విశాఖలో పెట్టడాన్ని స్వాగతించారు.

విశాఖ‌లో గంటా శ్రీ‌నివాస‌రావు మీడియాతో మాట్లాడుతూ...విశాఖ వాసిగా ఇక్కడ రాజధానిని స్వాగతిస్తున్నానని తెలిపారు. అయితే రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని గంటా డిమాండ్  చేశారు. విశాఖలో రాజధాని వస్తే శాంతిభద్రతలు లోపిస్తాయన్న భయాందోళనలను ప్రభుత్వం తొలగించాలన్నారు.

తాను ఏం మాట్లాడినా వివాదాస్పదం చేస్తున్నారన్న గంటా సంబంధం లేని విషయాలను తెరపైకి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పార్టీ మారతారంటూ వస్తున్న వార్తలను గంటా శ్రీనివాసరావు కొట్టిపారేశారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. అమరావతికి మద్దతివ్వాలనే పార్టీ ఆదేశాలను పాటిస్తానని ఆయ‌న పేర్కొన్నారు. గంటా క్లారిటీతో అయినా...ఆయ‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారానికి ఫుల్ స్టాప్ ప‌డుతుందో వేచి చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English