భారీ సవాల్.. ఫ్రూవ్ చేస్తే అందరి ఎదుట కాళ్లు మొక్కుతానంది

భారీ సవాల్.. ఫ్రూవ్ చేస్తే అందరి ఎదుట కాళ్లు మొక్కుతానంది

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు వ్యవహారంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సంచలన నిర్ణయాలకు కేరాఫ్ గా నిలుస్తున్న జగన్ ప్రభుత్వం ఏపీ రాజధాని విషయంలో తాను అనుకున్న రీతిలో నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. మూడు రాజధానులపై అమరావతి రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్యాయం చేయొద్దంటూ నిరసనలు.. ఆందోళనలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న వారిని పెయిడ్ ఆర్టిస్టులగా ఏపీ అధికార పక్షానికి చెందిన పలువురు అభివర్ణిస్తున్న వేళ.. టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఆందోళన చేస్తున్న రైతులు కానీ పెయిడ్ ఆర్టిస్టులని రుజువు చేస్తే బహిరంగంగా తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీదేవి కాల్లు పట్టుకుంటానని సవాల్ విసిరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవిపై పంచుమర్తి అనురాధ భారీ సంచ్ లను సంధించారు. ఎమ్మెల్యే ఎన్నికే అనిశ్చితిలో ఉందని.. దళితులకు దక్కాల్సిన అవకాశాన్ని హైజాక్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైనాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్యే గెలుపు కోసం పని చేసిన రాయపూడికి చెందిన మల్లెల హరేంద్రనాథ్ రైతుల పక్షాన నిలిచారని.. ఆయన కూడా పెయిడ్ ఆర్టిస్టా? అని ప్రశ్నించారు.

గ్రామ సచివాలయాలకు కడుపు మండి నల్లరంగు పూసిన మీ పార్టీ వారు కూడా పెయిడ్ ఆర్టిస్టులేనా? అని నిలదీశారు. ఫిరంగిపురం గెస్ట్ హౌస్ లో ఆళ్ల రామకృష్ణారెడ్డి సాగించే అనైతిక కార్యకలాపాలు ప్రజలందరికి తెలుసంటూ పంచుమర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. వాడీవేడిగా మారిన పంచుమర్తి పంచ్ లకు ఎమ్మెల్యే శ్రీదేవి ఎలా రియాక్ట్ అవుతారో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English