హరీశ్ రావు మాట తో జగన్ ను టార్గెట్ చేసిన లోకేష్

హరీశ్ రావు మాట తో జగన్ ను టార్గెట్ చేసిన లోకేష్

నిజమే... సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో యమా యాక్టివ్ గా ఉంటున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేశ్... తన రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడిపోతున్నారు. ఏది మాట్లాడినా... సెటైరిక్ గా, అవతలి వారు అసలు నోరెత్తి సమాధానం చెప్పలేని రీతిలో లోకేశ్ సంధిస్తున్న విమర్శలు నిజంగానే ఇప్పుడు బాగా పేలిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏపీకి మూడు రాజధానులు అంటూ జగన్ అమలు చేస్తున్న వ్యూహంపై లోకేశ్ సంధించిన ట్వీట్ కూడా బాగా పేలింది.

స్థిరత్వంతో కూడిన పాలనతో కలిగే లాభాలివేనంటూ టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ కీలక మంత్రి తన్నీరు హరీశ్ రావు... ఇటీవల ఓ కీలక ప్రసంగం చేశారు. దేశంలోని అన్ని ప్రాంతాలతో పోలిస్తే... హైదరాబాద్ అభివృద్ధిలో ఓ రేంజిలో దూసుకెళుతోందని ఆయన చెప్పుకొచ్చారు. ఇందుకు తెలంగాణలో కొనసాగుతున్న మంచి పాలననేనని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఏపీలో నెలకొన్న అస్థిర పరిస్థితులు కూడా తమకు బాగానే కలిసివచ్చే అవకాశాలున్నాయంటూ కూడా హరీశ్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. హరీశ్ కామెంట్లు విన్నంతనే లోకేశ్ తనదైన శైలిలో స్పాంటేనియస్ గా స్పందించారు.

‘వైఎస్ జగన్ గారి అద్భుత పాలనా పాటవాల గురించి పక్క రాష్ట్రాల మంత్రులు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో చూడండి’ అంటూ లోకేశ్ సంధించిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. తన ట్వీట్ కు లోకేశ్... హరీశ్ రావు ప్రసంగానికి సంబంధించి వీడియోను కూడా యాడ్ చేసేశారు. ఏపీ రాజధాని అమరావతిలో అనిశ్చితి కారణంగా హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజుకుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హరీశ్ చేసిన వ్యాఖ్యలను లోకేశ్ ప్రస్తావించారు. మొత్తంగా జగన్ తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలతో ఏపీకి తీరని అన్యాయం జరుగుతోందన్న కోణంలో లోకేశ్ తనదైన శైలి చతురతతో జగన్ ను ఓ ఆటాడేసుకున్నారనే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English