అమ‌రావ‌తిని సాగతీస్తున్న జగన్

అమ‌రావ‌తిని సాగతీస్తున్న జగన్

రాజ‌ధాని అమ‌రావ‌తి స‌మ‌స్య కు ముళ్ల‌ మీద ముళ్లు ప‌డుతున్నాయా?  తాజాగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్వ‌హించిన కేబినెట్ స‌మావేశం అనంత‌రం తీసుకున్న కీల‌క నిర్ణ‌యం ఇదే సందేహాన్ని బ‌ల‌ప‌రుస్తోంది. ప్ర‌స్తుతం రాజ‌ధాని అమ‌రావ‌తిని ఎట్టి ప‌రిస్థితిలోనూ మార్చి తీరాల‌ని నిర్ణ‌యించిన సీఎం జ‌గ‌న్ బృందం.. ఈ క్ర‌మంలో ఎదురైన అనూహ్య అమ‌రావ‌తి ప్ర‌జ‌ల వ్య‌తిరేక‌త‌ను త‌న‌కు అను కూలంగా మార్చుకోవ‌డంతోపాటు.. గ‌త ప్ర‌భుత్వ నిర్వాకం వ‌ల్లే తాము అమ‌రావ‌తిని మార్చాల్సి వ‌స్తోంద‌ని చెప్పేందుకు కూడా వ్యూహాత్మ‌కంగా వేస్తున్న అడుగులు అమ‌రావ‌తి నిర్మాణం స‌హా.. రాజ‌ధాని విష‌యాన్ని మ‌రింత‌గా జాప్యం చేసే సూ చ‌న‌లు క‌ని పిస్తున్నాయి.

రాజ‌ధానిగా అమ‌రావ‌తి ప్ర‌క‌ట‌న‌కు ముందుగానే టీడీపీ అధినేత అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు త‌న వారికి రాజ‌ధానిపై ఉప్పందించార‌ని, దీంతో దాదాపు 900 ఎక‌రాల అసైన్డ్ భూముల‌ను టీడీపీలోని కీలక నాయ‌కులు బినామీ పేర్లు స‌హా త‌మ వారి పేరిట కూడా కొనుగోలు చేశార‌ని, ఇది పెద్ద కుంభ‌కోణ‌మ‌ని తాజాగా మంత్రి పేర్ని నాని మీడియాకు చెప్పుకొచ్చారు. వాస్త‌వానికి ఎన్నిక‌ల‌కు ముందు నుంచి కూడా వైసీపీ ఇదే తీరుగా విమ‌ర్శ‌లు చేస్తోంది.

అయితే, ప్ర‌భుత్వంలోకి వచ్చి ఆరు మాసాలు పూర్తి అయిన నేపథ్యంలో స‌హ‌జంగా నే టీడీపీ నేత‌లు ఈ ఆరోప‌ణ‌ల‌ను నిరూపించాల‌నే డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇటీవ‌ల ముగిసిన అసెంబ్లీ స‌మావేశాల్లో సాక్షాత్తూ ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి దీనిని పూర్తి స్థాయిలో వివ‌రించారు. ఇక‌, ఇప్పుడు అమ‌రావ‌తిని మార్చేయాల‌ని నిర్ణ‌యించుకున్న జ‌గ‌న్ స‌ర్కారుకు ప్ర‌జ‌లు స‌హా రైతుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తోంది.

ఈ నేప‌థ్యంలో అమ‌రావ‌తి విష‌యంలో గ‌త ప్ర‌భుత్వాన్ని బోనులో నిల‌బెట్టి.. ప్ర‌జాకోర్టులోనే స‌ద‌రు ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుల‌ను తాము స‌రిచేస్తున్నామ‌ని, ఈ క్ర‌మంలోనే అమ‌రావ‌తి ప్రాధాన్యాన్ని త‌గ్గించ‌కుండా.. గ‌త ప్ర‌భుత్వంలో జ‌రిగిన లోపాల‌ను స‌రిచేస్తున్నామ‌ని చెప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇక‌, ఇప్ప‌టికే వ‌చ్చిన జీఎన్ రావు క‌మిటీ నివేదిక‌తోపాటు.. బోస్ట‌న్ క‌న్స‌ల్టింగ్ కంపెనీ ఇచ్చే నివేదిక‌ను కూడా ప‌రిశీలించి .. దీనిపై మ‌రో హై ప‌వ‌ర్ మంత్రుల క‌మిటీని నియ‌మించి.. త‌ర్వాత ఈ మొత్తం మూడు నివేదిక‌ల‌ను అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టి.. అమ‌రావ‌తిపై నిర్ణ‌యం ప్ర‌క‌టించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

దీంతో ఈ మొత్తం ప్ర‌క్రియ అంతా కూడా ఇప్ప‌ట్లో తేల‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. క‌నీసం ఆరు మాసాల గ‌డువు ప‌డుతుంద‌ని ప్రాధ‌మికంగా అంచ‌నా వేస్తున్నారు. అప్ప‌టికి రాజ‌ధాని ప్రాంత రైతులు, ప్ర‌జ‌ల్లోనూ కూడా ఆందోళ‌న‌ల‌ను త‌గ్గుతాయ‌ని భావిస్తున్నారు. మొత్తానికి జ‌గ‌న్ వ్యూహంతో చంద్ర‌బాబు అండ్ టీం ఇబ్బందుల్లో ప‌డుతుందా?  లేక జ‌గనే ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాడా? అనేది వేచి చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English