టీడీపీ నేత‌ మ‌ర‌ణం.. బోరున విల‌పించిన వైసీపీ మంత్రి

టీడీపీ నేత‌ మ‌ర‌ణం.. బోరున విల‌పించిన వైసీపీ మంత్రి

తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌,  ఏలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బడేటి కోటరామారావు (బుజ్జీ) గుండెపోటుతో కన్నుమూశారు. సుప్ర‌సిద్ధ న‌టుడు ఎస్వీ రంగారావుకు బడేటి బుజ్జి స్వయాన మేనల్లుడు. బడేటి బుజ్జి భౌతికకాయన్ని ప‌లువురు ప్ర‌ముఖులు సందర్శించారు. ఈ సంద‌ర్భంగానే వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఏపీ వ్యవసాయశాఖ‌ మంత్రి కురసాల కన్నబాబు సైతం బుజ్జి పార్థివ దేహానికి అంజ‌లి ఘ‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న క‌న్నీరు కార్చారు.

బ‌డేటి బుజ్జి స్థానిక పవర్‌పేటలోని త‌న క్యాంపు కార్యాలయంలో బుధవారం రాత్రి పార్టీ కార్యకర్తలతో గడిపి భోజనం ముగించుకుని తన గదిలో ప‌డుకున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట నమయంలో తీవ్రస్థాయిలో గుండెనొప్సి రావడంతో కుటుంబసభ్యులు ఆయన్ను ఆర్ఆర్ పేటలోని స్టైవేట్‌ ఆనుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆయన మృతి చెందినట్టు నిర్ధారించారు. బుజ్జి మృతితో ఏలూరులో విషాదఛాయలు అలముకున్నాయి. పార్టీలకు ఆతీతంగా ప్రజలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు.

బుజ్జి మ‌ర‌ణ‌వార్త తెలియ‌డంతో విచ్చేసిన మంత్రి క‌న్న‌బాబు ఆయ‌న భౌతిక కాయంపై పుష్పాంజ‌లి ఘ‌టిస్తూ రోధించారు. పార్టీలు వేరైన‌ప్ప‌టికీ ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య వ్య‌క్తిగ‌త సంబంధాలు ఉన్నాయ‌ని స‌మాచారం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అయిన కన్నబాబు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం. అలా బడేటి బుజ్జి ఆయనకు సన్నిహితుడని, అందుకే ఆప్తుడి మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌ పోయార‌ని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English