హ‌రీశ్‌రావుకు కేసీఆర్ ఇచ్చిన తాజా షాక్ ఏంటో తెలుసా?

హ‌రీశ్‌రావుకు కేసీఆర్ ఇచ్చిన తాజా షాక్ ఏంటో తెలుసా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు, ఆయ‌న మేన‌ల్లుడు హ‌రీశ్ రావుకు మ‌ధ్య ఏర్ప‌డిన క‌మ్యూనికేష‌న్ గ్యాప్ అంతా స‌ద్దుమ‌ణిగిపోయింద‌ని అనుకుంటున్న త‌రుణంలో కొత్త చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది. రెండో ద‌ఫా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన  అనంత‌రం మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కుండా మాట ఇచ్చిన షాక్‌తో హ‌రీశ్ రావు ఖంగు తిన్నార‌ని...అయితే కేబినెట్ బెర్త్ ఇచ్చిన ఆయ‌న్ను కేసీఆర్ ఖుష్ చేశార‌నే టాక్ ఉన్న సంగ‌తి తెలిసిందే. కానీ ఇప్పుడు కొత్త చ‌ర్చ జ‌రుగుతోంది. హ‌రీశ్ రావు శాఖ‌లో ఆయ‌న‌కు ఏమాత్రం సంబంధం లేకుండా, ప్ర‌మేయం లేకుండా కేసీఆరే స‌ర్వం చేసేస్తున్నార‌ని టాక్ న‌డుస్తోంది.

ఆర్థికశాఖకు ప్రత్యేక మంత్రి ఉన్నప్పటికీ ఆయన ప్రమేయం లేకుండానే వ్యవహారాలన్నీ జరిగిపోతున్నాయి. వీటిని న‌డిపించేది ఇంకెవ‌రో కాదు...తెలంగాణ సీఎం కేసీఆర్‌. 2020-21 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ రూపకల్పనకు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ప్రగతి భవన్‌లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్‌ ఎస్‌కే జోషీతోపాటు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులు అందులో పాల్గొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జీఎస్టీలో అంతర్భాగంగా ఉండే ఐజీఎస్టీ నిధులు విడుదల కాకపోవటం, కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటాను గణనీయంగా తగ్గించటంపై ముఖ్యమంత్రి కూలంకుషంగా చర్చించారు. ఈ స‌మావేశంలో లేనిది ఎవ‌రో తెలుసా? ఆర్థిక మంత్రి హరీశ్‌రావు!

కాగా, హ‌రీశ్‌రావుకు మంత్రి ప‌ద‌వి ఇచ్చిన‌ప్ప‌టికీ...ఆ శాఖ‌పై త‌న‌దే పెత్త‌నం అన్న‌ట్లుగా సీఎం వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా హరీశ్‌రావుకు ఆర్థిక శాఖ కేటాయించ‌డం, ఆయ‌న పదవి చేపట్టిన కొద్ది నెలలకే రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి వచ్చిన సంద‌ర్భంలో వ్య‌వ‌హ‌రించిన తీరును ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు.

శాసనసభ లో ఆర్థిక‌మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆరే.. శాసనసభలో బడ్జెట్‌పద్దును చదవి వినిపించారని గుర్తు చేస్తున్నారు. ఆర్థిక‌ శాఖను హ‌రీశ్‌కు కేటాయించిన‌ప్ప‌టికీ...స‌ర్వ‌హ‌క్కులు త‌న‌వే అన్న‌ట్లు కేసీఆర్ అధికారుల‌కు సైతం సూచ‌న‌లు ఇచ్చార‌నే టాక్ వినిపిస్తోంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English