3 రాజధానులు ఆలోచన ఆయనదేనా?

3 రాజధానులు ఆలోచన ఆయనదేనా?

ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చేమో అంటూ శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ వదిలిన ఫీలర్ ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. రాజధానిపై నిపుణుల కమిటీ త్వరలో నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలో సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు యథాలాపం కాదని, దీని వెనుక కచ్చితంగా అదే ఆలోచన ఉండొచ్చని వినిపిస్తోంది.

అయితే, ఇది జగన్ బుర్రలోని ఆలోచన కాదని.. ఆయన కేబినెట్లోని ఓ మంత్రి ఆలోచననని చెబుతున్నారు. కొద్దిరోజులుగా రాజధానిపై రోజుకో మాట రావడం వెనుకా ఆయనే ఉన్నారని చెబుతున్నారు.

పథకాలు ఎన్నో పెడుతున్నా వాటికి ఇవ్వడానికి ఖజానాలో డబ్బుల్లేని పరిస్థితి ఎదుర్కొంటోంది ఏపీ. ఈ సమయంలో రాష్ట్రానికి, నాయకులకు కూడా డబ్బులు వచ్చేలా సదరు మంత్రి ఈ మూడు రాజధానుల ప్లాన్ జగన్ ముందుంచారని చెబుతున్నారు.

ముఖ్యంగా విశాఖపట్నం కూడా ఒక రాజధాని కావొచ్చన్న ఫీలర్ రావడంతో అక్కడ రియల్ ఎస్టేట్ ఇప్పడు భారీగా పెరగనుంది. దీంతో ఇప్పటికే అక్కడ ఆస్తులు భారీగా ఉన్న సదరు మంత్రి, వైసీపీకి చెందిన ఇతర నేతలు లాభపడనున్నారు. అదే సమయంలో విశాఖ, కర్నూలులోనూ రాజధానులొస్తాయన్న లెక్కతో ఉత్తరాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ఊపందుకోనుంది. పలితంగా రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరగనుంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English