విలేక‌రుల స‌మావేశంలో దొరికిపోయిన రాజు ర‌వితేజ‌

విలేక‌రుల స‌మావేశంలో దొరికిపోయిన రాజు ర‌వితేజ‌

రాజు ర‌వితేజ‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ముడిప‌డ్డ ఈ పేరు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మామూలు జ‌నాల‌కు అస‌లెవ‌రో తెలియ‌ని ఈ వ్య‌క్తితో క‌లిసి ప‌వ‌న్ రాజ‌కీయ ప్ర‌యాణాన్ని ఆరంభించ‌డం అప్ప‌ట్లో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అత‌డితో క‌లిసి గ‌తంలో ఇజం అనే పుస్త‌కం కూడా రాశాడు ప‌వ‌న్. జ‌న‌సేన ఆవిర్భావంలో ర‌వితేజ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాడు కూడా. కానీ 2014 ఎన్నిక‌ల త‌ర్వాత ప‌వ‌న్‌తో విభేదించి పార్టీ నుంచి బ‌య‌టికి వెళ్లిపోయాడు. మ‌ళ్లీ కొన్నేళ్ల త‌ర్వాత పార్టీలోకి పున‌రాగ‌మ‌నం చేశాడు. పొలిట్ బ్యూరో స‌భ్యుడిగా కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చాడు. అలాంటి వాడు ఉన్న‌ట్లుండి ప‌వ‌న్ మీద తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తూ తాజాగా జ‌న‌సేన‌కు గుడ్ బై చెప్ప‌డం షాకింగే.

ఈసారి ర‌వితేజ వ్యాఖ్య‌లు, విమ‌ర్శ‌లు చూస్తే.. ఆయ‌న జ‌గ‌న్ పంచ‌న చేర‌బోతున్నార‌న్న‌ది స్ప‌ష్ట‌మైంది. వైకాపానే ర‌వితేజ‌ను ప‌వ‌న్ మీదికి ఉసిగొల్పిన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యం శ‌నివారం హైద‌రాబాద్ ప్రెస్ క్ల‌బ్‌లో ర‌వితేజ‌ పెట్టిన ప్రెస్ మీట్‌తో స్ప‌ష్ట‌మైపోయింది. జ‌గ‌న్ స‌ర్కారుకు వ‌కాల్తా పుచ్చుకున్న‌ట్లుగా ర‌వితేజ మాట్లాడాడు ఇక్క‌డ‌. ప‌వ‌న్ స్వ‌యంగా ఓడిపోయాడ‌ని, ఒక్క ఎమ్మెల్యే సీటే జ‌నసేన‌కు వ‌చ్చింద‌ని.. జ‌నాలు ఆ పార్టీని తిర‌స్క‌రించార‌ని.. అలాంట‌పుడు ప్ర‌స్తుతం ప‌వ‌న్‌, జ‌న‌సేన‌ ఏపీలో ప్ర‌తిప‌క్ష పాత్ర ఎలా పోషిస్తార‌ని ప్ర‌శ్నించాడు ర‌వితేజ‌. ఐతే ఎన్నిక‌ల్లో ఓడిపోయినంత మాత్రాన, ఒక్క సీటే వ‌స్తే మాత్రం ప్ర‌భుత్వం మీద విమ‌ర్శ‌లు చేయ‌రాద‌న‌డం ఏం లాజిక్కో అర్థం కావ‌ట్లేదిక్క‌డ‌.

మ‌రోవైపు ప‌వ‌న్ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత త‌న నియోజ‌క‌వ‌ర్గాలైన‌ గాజువాక‌లో కానీ, భీమ‌వ‌రంలో కానీ ప‌ర్య‌టించ‌లేదంటూ ఈ ప్రెస్ మీట్లోనే విమ‌ర్శించాడు ర‌వితేజ‌. కానీ ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌వ‌న్ ప‌ర్య‌టించాడు. ఇదే విష‌యాన్ని ఓ విలేక‌రి స్ప‌ష్టంగా చెబుతుంటే.. అక్క‌డేవో శ‌బ్దాలు వినిపిస్తున్నాయి, నాకు వినిపించ‌ట్లేదంటూ ర‌వితేజ మాట దాట వేసి అడ్డంగా దొరికిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోల్ని జ‌నసైనికులు వైర‌ల్ చేస్తూ ర‌వితేజ గాలి తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English