కేఏపాల్‌కు అమిత్‌షా ఫోన్‌... ట్రంప్‌ను కలవడానికి కేఏపాల్‌ యూఏఎస్ కు..

కేఏపాల్‌కు అమిత్‌షా ఫోన్‌... ట్రంప్‌ను కలవడానికి కేఏపాల్‌ యూఏఎస్ కు..

ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు, క్రైస్త‌వ మ‌త ప్రబోధ‌కుడు కేఏ పాల్ మ‌ళ్లీ వార్త‌ల్లోకి ఎక్కారు. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఒకింత మీడియాకు దూరంగా ఉన్న‌ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' సినిమాపై స్పందించడంతో వార్త‌ల్లో నిలుస్తున్నారు. ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్న పాల్ వివిధ మీడియా సంస్థ‌ల‌తో అక్క‌డి నుంచే స్పందిస్తున్నారు. అయితే, తాజాగా సోమాజీగూడా ప్రెస్‌క్ల‌బ్‌లో స్కైప్ ద్వారా మీడియాను ఉద్దేశించి ప్ర‌సంగించారు. , బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, తెలుగు రాష్ట్రాల సీఎంలు కే చంద్ర‌శేఖ‌ర్ రావు, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి, ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌...ఇలా అంద‌రిపైనా...త‌న‌దైన శైలిలో పాల్ కామెంట్లు చేశారు.

సోమాజీగూడ‌లో స్కైప్ కేంద్రంగా పాల్ త‌న అభిప్రాయాలు వివ‌రించారు. రాంగోపాల్ వర్మ తీసిన సినిమా కులాల మధ్య చిచ్చు పెట్టె విధంగా ఉంద‌ని పాల్ ఆరోపించారు. త‌న పేరుని కూడా వాడుకోలేని దుస్థితి రాంగోపాల్ వర్మది అని పాల్ ఆరోపించారు. "సెన్సార్ బోర్డు ఆదేశాల మేరకు కొన్ని మార్చి సినిమా సెట్ చేసాడు. రాం గోపాల్ వర్మ నోరు విప్పితే అబ్దద్దాలే. అలాంటి వ్య‌క్తి దేవుడిని క్షమాపణ కోరితే మంచిది." అని పాల్ సూచించారు. 'ఇప్పటికైనా దేవుని దయ ఆయన పైన ఉంటే మంచి సినిమాలు చేస్తే మంచిది... ఇలాంటి పిచ్చి సినిమాలు తీయకపోతేనే మంచిది..' అని సూచించారు.

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవడానికి తాను యూఏఎస్ వ‌చ్చాన‌ని కేఏ పాల్ వివ‌రించారు. "నెల రోజుల నుండి ఇక్కడే ఉన్నాను. నాకు పబ్లిసిటీ అవసరం లేదు. ప్రపంచ శాంతి కోసం తిరుగుతున్నాను. నాతో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా నాతో మాట్లాడారు." అని కేఏ పాల్ వెల్ల‌డించారు. అవసరమైన కార్యక్రమాలు చేస్తున్నానని కేఏ పాల్ వెల్ల‌డించారు. "నాకు చీప్ పబ్లిసిటీ అవసరం లేదు. నేను ఎన్నికలను మార్చిలో బహిష్కరించాను. అప్పులు చేస్తున్న ఇరు రాష్ట్రాల సీఎం అభివృద్ధి చేయటం లేదు." అని తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులైన కేసీఆర్‌, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై పాల్ మండిప‌డ్డారు. రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కోరితే వేల కోట్లు లాభం వచ్చేలా చేస్తానని కేఏ పాల్ ఇద్ద‌రు సీఎంల‌కు ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English