జగన్‌ను ఇరుకునపెట్టేందుకు బీజేపీ బడా స్కెచ్

జగన్‌ను ఇరుకునపెట్టేందుకు బీజేపీ బడా స్కెచ్

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డికి కేంద్రంలోని బీజేపీ చాలా తెలివిగా షాకివ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రతిష్ఠ దిగజారేలా సింపుల్ వ్యూహం వేయనున్నట్లు సమాచారం. రాజకీయంగా బయటకు కనిపించేలా కాకుండా విజయవాడలో సీబీఐ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడం ద్వారా జగన్‌ను ఇబ్బంది పెడతారని తెలుస్తోంది.

సీఎం జగన్ హైదరాబాద్ లో ఉన్న కోర్టుకు రావడానికి భద్రతాపరమైన కారణాలు ఎదురవుతుండడంతో కేంద్రమే విజయవాడ లేదా గుంటూరులో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తున్నదని అంటున్నారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసిన తరువాత జగన్ క్రమం తప్పకుండా, పిలిచినప్పుడల్లా వెళ్లాల్సి ఉంటుంది. ఇలా కోర్టులకు వెళ్లడం వల్ల జగన్ ప్రతిష్ట దిగజారుతుందనేది బీజేపీ పెద్దల అంచనా. అక్రమాస్తుల కేసుల్లో జగన్ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

విజయవాడకు సీబీఐ కోర్టు మంజూరు చేయాలని ఈ మధ్య కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు ఒక విజ్ఞాపన పత్రం అందింది. అ విజ్ఞాపన పత్రం ఇచ్చింది బీజేపీ కి చెందిన రాజ్యసభ సభ్యులు జీవీఎల్.నరసింహారావు. ఏపీకి న్యాయశాఖ పరంగా రావాల్సిన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే సీబీఐ ప్రత్యేక కోర్టు ఏర్పాటు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
విజయవాడకు సీబీఐ కోర్టు గతంలోనే మంజూరయిందని, ఇంత వరకూ ప్రారంభం కాలేదని వివరించారు. వీలైనంత త్వరగా అది ప్రారంభమయ్యేలా చూడాలని కోరారు. ఏపీకి సంబంధించిన అనేక అంశాలు పెండింగ్ లో ఉండగా బీజేపీ బృందానికి సీబీఐ ప్రత్యేక కోర్టు అంశమే గుర్తుకు రావడానికి కారణం జగన్‌ను ఇరుకునపెట్టే యత్నమేనని టాక్.

నిజానికి ఏపీ ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర సంస్థల ఏర్పాటు కోసం పదేపదే కేంద్రాన్ని కోరుతోంది. వాటి విషయంలో ఎలాంటి ముందడుగు వేయని కేంద్రం సీబీఐ ప్రత్యేక కోర్టు విషయంలో మాత్రం స్పీడవుతుండడంతో వైసీపీలో ఆందోళన మొదలవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English