రోజాపై అయేషా తల్లి సంచలన వ్యాఖ్యలు

రోజాపై అయేషా తల్లి సంచలన వ్యాఖ్యలు

సుమారు పన్నెండేళ్ల క్రితం చోటు చేసుకున్న అయేషా మీరా హత్య కేసు ఉమ్మడి రాష్ట్రంలో ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. దాదాపు పన్నెండేళ్ల తర్వాత ఆమె డెడ్ బాడీకి ఈ రోజు మరోసారి రీ పోస్టుమార్టం నిర్వహించనన్నారు. ఈ వ్యవహారం ఇలా ఉంటే.. తన కుమార్తె మరణానికి కారణమైన నిందితుల్ని శిక్షించాలంటూ అయేషా తల్లి అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నా ఫలితం లేకపోయింది.

తాజాగా తన కుమార్తె డెడ్ బాడీకి మరోసారి రీపోస్ట్ మార్టం జరుగుతున్న వేళలో అయేషా తల్లి బేగం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన జరిగిన రోజున హడావుడి చేసిన రోజా.. ఇప్పుడు ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. అయేషా హత్యలో నిందితులు ఎవరో రోజాకు తెలుసన్నారు.

అత్యాచారం.. హత్య లాంటి తీవ్రమైన నేరాలు జరిగితే 21 రోజుల్లో నిందితుల్ని పట్టుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పటంతో పాటు.. కొత్త చట్టాన్ని తెర మీదకు తేవటం తెలిసిందే. ఇలాంటి వేళ.. అయేషా తల్లి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి.. దీనిపై రోజా ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

2007 డిసెంబరులో విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అయేషా మీరా దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి ప్రతి అంశం సంచలనంగా మారటమే కాదు.. ఫజిల్ గా మారింది. ఈ హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న సత్యంబాబును 2017 మార్చి 31న హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే.. తొలుత ఇతడ్ని దోషిగా నిర్దారించారు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. హతురాలు అయేషా తల్లి సైతం సత్యంబాబు నిందితుడు కాడని పేర్కొనటం.  ఇప్పటికి ఈ కేసుకు సంబంధించిన దోషి ఎవరన్నది ఇంతవరకూ తేలలేకపోవటం గమనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English