మెగాస్టారా? బొత్స బాబా?

మెగాస్టారా? బొత్స బాబా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు?, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ , లేక కేంద్ర మంత్రి చిరంజీవా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు అహ్మద్ పటేల్, జైరాంరమేష్, దిగ్విజయ్ సింగ్,మోతీలాల్ ఓరా లతో సోనియాగాంధీ సుధీర్ఘంగా చర్చలు సాగించారు.   రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిని నియమించి ఎన్నికలకు ఆయన సారథ్యంలో ముందుకు సాగాలని ఈ సమావేశంలో  నిర్ణయించినట్టు కాంగ్రెస్ వర్గాల కథనం. ఇప్పటి వరకు  సిఎం రేసులో కన్నా, ఆనం వంటి వారి పేర్లు వినిపించినా కూడా వారిని పక్కన బెట్టినట్టు తెలిసింది. కేవలం చిరంజీవి, బొత్స పేర్లు మాత్రమే  సిఎం పదవికోసం పరిశీలిస్తున్నట్టు కూడా వార్తలు వెలుబడ్డాయి. 

చిరంజీవి తనకంటూ ఓ పార్టీని స్థాపించి రాష్ట్రం అంతటా పర్యటించి తన సత్తా చాటుకున్న వారు. అంతే కాదు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆయన పార్టీని విలీనం చేస్తే కీలక బాధ్యతలు అప్పగిస్తామని మాట కూడా ఇచ్చింది. ఆయనకు ప్రజాకర్షణ కూడా ఉండడం కలిసి వచ్చే అంశం. అయితే ఆయన రాజకీయాలకు కొత్త. పాలనా అనుభవం లేదు, ముఖ్యమంత్రి వంటి పెద్ద పదవిని చేపట్టగలరా అన్నది కాస్తా మైనస్ . ఇక బొత్స విషయానికి వస్తే రాజకీయాల్లో సీనియర్, పిసిసి అధ్యక్షునిగా పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా పట్టున్న మనిషి. ఇక సీనియర్ కాబట్టి సిఎం పదవిని చిరంజీవి కంటే సమర్థంగా నిర్వహించగలరు అన్నది కూడా ఆయనకు ప్లస్ అయ్యే అంశాలు. అయితే ఆయనకు ప్రజాక్షేత్రంలోకి రాష్ట్రస్థాయి నాయకుడిగా వెళ్లి ప్రచారం నిర్వహించేంత స్థాయి లేదు, ఎంత సీనియర్ అయినా ఆయన తన విజయనగరం జిల్లా వరకే పరిమితం అయ్యారు.

ఇక పోతే ఆయనపై మద్యం మాఫియా, అప్పట్టో సీమాంద్ర ఆందోళనకారులపై పోలీసులతో లాఠీ చార్జీ చేయించడం, ఒకరిని చంపించారని ఆరోపణలు రావడం, సీమాంద్రలో ఆయన వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన జరగడం వంటివి ఆయనకు ముఖ్యమంత్రి పదవి విషయంలో ఆటంకాలుగా మారవచ్చు. అయితే ఈ ఇద్దరిలో సిఎం పోస్టు బొత్సకు వస్తే ఆయనకు పదోన్నతి లభించినట్టే. అలా కాక చిరంజీవికి వస్తే బొత్స కు పదోన్నతి మాట దేవుడెరుగు ఉన్న పదవి పోతుంది అన్న వార్తలు కూడా వెలుబడుతున్నాయి. ఎందుకంటే చిరంజీవి, బొత్స ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. చిరంజీవికి సిఎం పదవి ఇస్తే అంతటితో సమానమైన పిసిసి అధ్యక్షపదవి అదే సామాజిక వర్గానికి ఉంచరని తెలుస్తోంది. అదే జరిగితే బొత్సను పిసిసి పదవి నుంచి కూడా తప్పించి మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ను పిసిసి అధ్యక్షునిగా చేస అవకాశం వుంది. ప్రస్తుతానికి ఢిల్లీలో వున్న పరిస్థితుల దృష్ట్యా బొత్సకే అవకాశాలు ఎక్కువగా వున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రాజకీయంగా చాలా మార్పులు వచ్చే అవకాశం కూడా వుంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English