సీనియ‌ర్ల‌కు షాకిస్తున్న చంద్ర‌బాబు...

సీనియ‌ర్ల‌కు షాకిస్తున్న చంద్ర‌బాబు...

టీడీపీలో సీనియ‌ర్ నేత‌ల‌కు చంద్ర‌బాబు వ‌రుస‌గా షాకిలిస్తున్నార‌ట‌. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ఓట‌మికి కొంత బాధ్య‌త వారిది కూడా ఉంద‌ని చంద్ర‌బాబు బ‌లంగా న‌మ్ముతున్నార‌ట‌. మొద‌టి నుంచి జిల్లాకు ఓ ఇద్ద‌రిని నేత‌ల‌ను అత్యంత విశ్వ‌స‌నీయ‌మైన నేత‌లుగా ఆయ‌న భావిస్తూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో వారు కొన్ని త‌ప్పులు చేసినా... వారు సూచించిన వారికి ప‌ద‌వులు ఇవ్వ‌డం.. నిధుల కేటాయింపు..ఇలా చాలా చేసిన చంద్ర‌బాబు ఇప్పుడు స‌ద‌రు నేత‌ల‌పై విసుగెత్తి పోయార‌ని స‌మ‌చారం.

తాజాగా ఈ సీనియ‌ర్ నేత‌ల మాట‌కు విలువ ఇవ్వ‌కుండా కొత్త‌ త‌రం నేత‌ల అభిప్రాయాల‌కు, ఆలోచ‌న‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్నార‌ట‌. ఈ కోవ‌లోనే య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి, క‌ళావెంక‌ట్రావు, వంటి నేత‌ల‌ను దాదాపుగా చంద్ర‌బాబు ప‌క్క‌న పెట్టేశార‌ని టీడీపీ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.

వాస్త‌వానికి సీనియ‌ర్లుగా చెప్పుకునే ప‌లువురు నేత‌లు పార్టీకి భారంగా మారార‌ని, త‌మ సొంత స్వార్థ‌పూరిత రాజ‌కీయాల కోసం,మ‌నుగ‌డ కోసం ఇన్నాళ్లు చంద్ర‌బాబును త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని, జిల్లా పార్టీ, రాజ‌కీయాల్లో ప‌బ్బం గ‌డుపుకున్నార‌ని టీడీపీలోని యువ నేత‌లు కాస్త ఘాటుగానే ఇప్పుడు విమ‌ర్శ‌లు మొద‌లుపెట్ట‌డం గ‌మ‌నార్హం.

తెలుగుదేశం పార్టీని ముంచింది ఎవరూ అంటే... ముందు ఎక్కువగా వినపడేది సీనియర్ నేతలేన‌ని  యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కళా వెంకట్రావు వంటి నేతల పేర్ల‌ను గుర్తు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. తూర్పు గోదావరి జిల్లాలో యనమలది ఏక‌ఛ‌త్రాధిప‌త్యంమైంద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

పార్టీ అధినేత చంద్ర‌బాబు త‌న‌కు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని బాగా పార్టీలో ప్ర‌చారం చేయించుకుని నెంబ‌ర్ 2 అన్న‌ట్లుగా ఇటీవ‌లి వ‌ర‌కు వ్య‌వ‌హరించార‌ని, ఇప్పుడు చంద్ర‌బాబుకు అస‌లు విష‌యం బోధ‌ప‌డ‌టంతో ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టేశార‌ని చెబుతున్నారు.

ఇక నెల్లూరు జిల్లాలో  సోమిరెడ్డి  చంద్ర‌మోహ‌న్‌రెడ్డి వరుసగా ఆరు సార్లు ఓటమి పాలయ్యారు. అయినా సరే చంద్రబాబు ఆయన విషయంలో సానుకూలంగా ఉండటం, కీలక బాధ్యతలు ఇవ్వడం ఇన్నాళ్లు జ‌రిగింది. ఎన్నిక‌ల త‌ర్వాత నుంచి సోమిరెడ్డిని పార్టీ నిర్ణ‌యాల్లో చంద్ర‌బాబు దూరం పెడుతూ వ‌స్తున్నార‌ట‌.  

కొంత‌మంద సీనియ‌ర్లు ఏదో పార్టీని ఉద్ద‌రించ‌ బోతున్నామ‌ని చెప్ప‌బోతుండ‌గా సైలెంట్‌గా చెప్పిన ప‌ని చేసుకుంటూ  వెళ్లాల‌ని సూచిస్తున్న‌ట్లు టీడీపీ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.  అందుకే సోమిరెడ్డి కొంత కాలంగా ఏమీ మాట్లాడటం లేదని త్వరలోనే యనమలను కూడా పూర్తిగా ప‌క్క‌న పెట్టేసి రాష్ట్ర బాధ్యతలను... రామ్మోహన్ నాయుడు లాంటి యువ‌నేత‌కు ఇచ్చేందుకు చంద్ర‌బాబు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English