వైసీపీ కలర్ పాలిటిక్స్‌పై కోర్టు సీరియస్

వైసీపీ కలర్ పాలిటిక్స్‌పై కోర్టు సీరియస్

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ భవనాలకు సైతం ఆ పార్టీ రంగులు వేయడం ఇప్పటికే వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. పంచాయతీ కార్యలయాలు, చివరకు గాంధీ, అంబేద్కర్ వంటి జాతీయ నాయకుల విగ్రహాల గద్దెలకు కూడా వైసీపీ రంగులు వేసినట్లుగా ఉన్న చిత్రాలు, వీడియోలో సోషల్ మీడియాలో అంతా చూసే ఉంటారు.

దీనిపై విపక్షాలు కూడా కొద్దిరోజులు నిరసన గళం వినిపించాయి. విపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఇతర టీడీపీ నాయకులు దీనిపై ట్వీట్లూ చేశారు. అయితే, తాజాగా దీనిపై కోర్టు కూడా సూచనలు చేసింది.. ఇది కరెక్టు కాదని ప్రభుత్వానికి చెప్పింది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు పంచాయతీ ఆఫీసుకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ జరిపింది. ఇలాంటి చర్యలు సమంజసం కాదని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఏ పార్టీ అధికారంలో ఉన్నా... ఇలాంటి వాటికి పాల్పడకూడదని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని గుంటూరు కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. అయితే.. ఇప్పటికే విపక్షాల ఆందోళనతో ఈ రంగులు మార్చేసిన నేపథ్యంలో కలెక్టరు ఎలాంటి నివేదిక ఇస్తారు.. ప్రభుత్వం ఏమంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English