జగన్ మార్కు కక్ష... ఐఆర్ఎస్ అధికారిపై సస్పెన్షన్, విచారణ

 జగన్ మార్కు కక్ష... ఐఆర్ఎస్ అధికారిపై సస్పెన్షన్, విచారణ

ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... తనదైన మార్కు కక్షసాధింపులకే ప్రాధాన్యమిస్తున్నారన్న వాదనలు మరింతగా స్పష్టమవుతున్నాయనే చెప్పాలి. ఇప్పటికే టీడీపీ హయాంలో చంద్రబాబు సర్కారు తీసుకున్న ప్రతి నిర్ణయంపైనా పున:సమీక్ష అంటూ తనదైన మార్కు పాలనకు ప్రాధాన్యమిస్తూ సాగుతున్న జగన్... ఇప్పుడు తన కక్షసాధింపులను పతాక స్థాయికి తీసుకెళ్లారని చెప్పాలి.

చంద్రబాబు హయాంలో ఏపీ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డుకు సీఈఓగా పనిచేసిన ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిశోర్ ను జగన్ ప్రభుత్వం దాదాపుగా అష్టదిగ్బంధనం చేసేసింది. ఆలిండియా సర్వీసు అధికారి అయిన కృష్ణ కిశోర్ ను సస్పెండ్  చేసిన జగన్ ప్రభుత్వం... ఆయనపై ఏకంగా రెండు కేసులు నమోదు చేసి పారేసింది.

అంతేకాకుండా ఆరు నెలల్లో ఈ కేసుల దర్యాప్తును పూర్తి చేయాలని దర్యాప్తు సంస్థలను ఆదేశించిన జగన్ సర్కారు.. ఆ ఆరు నెలల పాటు అమరావతి నుంచి కట్టు కదలకుండా ఉండాలంటూ కృష్ణ కిశోర్ ను ఆదేశించింది.

టీడీపీ హయాంలో సీఎం హోదాలో చంద్రబాబు జరిపిన విదేశీ పర్యటనల్లో కృష్ణ కిశోర్ కీలకంగా వ్యవహరించారు. ఆయా దేశాల ప్రభుత్వాలతో పాటు ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీలతో చర్చలు జరిపి... ఏపీలో పెట్టుబడులు పెట్టేలా తనదై, శైలి సత్తా చాటిన కృష్ణ కిశోర్... రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రావడంలో కీలకంగా వ్యవహరించారు.

అంతేకాకుండా ప్రవాసాంధ్రులతో చర్చలు జరిపి... ఐటీ రంగంలో లెక్కలేననన్ని కంపెనీలను ఏపీకి వచ్చేలా చేయడంలోనూ కృష్ణ కిశోర్ కీలక భూమిక పోషించారు. కృష్ణ కిశోర్ పనితీరు కారణంగానే విదేశాల్లో కంపెనీలు పెట్టి సత్తా చాటిన ప్రవాసాంధ్రుల్లోని చాలా మంది ఏపీలో తమ తమ కార్యాలయాలను తెరిచారు. ఫలితంగా ఏపీకి చెందిన వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కూడా లభించాయి.

అయితే ఏమైందో తెలియదు గానీ... జగన్ ప్రభుత్వం కృష్ణ కిశోర్ పై దాదాపుగా కక్షగట్టినట్టుగా వ్యవహరిస్తోంది. గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కృష్ణ కిశోర్ ను సస్పెండ్ చేస్తున్నట్లుగా సంచలన నిర్ణయాన్ని వెలువరించిన జగన్ ప్రభుత్వం... ఏకంగా ఆయనపై ఏసీబీతో పాటు సీఐడీలకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ రెండు కేసుల దర్యాప్తులను సమాంతరంగా సాగించాలని పేర్కొనడంతో పాటుగా... ఈ దర్యాప్తులు పూర్తి అయ్యే దాకా ఆరు నెలల పాటు కృష్ణ కిశోర్ అమరావతిని విడిచి వెళ్లరాదంటూ సంచలన ఉత్వర్లులు జారీ చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English