దిశ ఘ‌ట‌న‌: దిమ్మ తిరుగుతున్న పెప్పర్‌ స్ప్రే సేల్స్‌

దిశ ఘ‌ట‌న‌: దిమ్మ తిరుగుతున్న పెప్పర్‌ స్ప్రే సేల్స్‌

హైదరాబాద్‌లో జ‌రిగిన దారుణ దిశ సంఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. మహిళపై అత్యాచార ఘటన నేపథ్యంలో...హైద‌రాబాద్ అనూహ్యంగా వార్త‌ల్లోకి ఎక్కింది. ఇదే స‌మ‌యంలో...మహిళలు, అమ్మాయిలు ఆత్మరక్షణలో భాగంగా మెట్రో రైళ్లలో పెప్పర్ స్ప్రే తీసుకెళ్లేందుకు హైదరాబాద్ మెట్రో అనుమతి ఇచ్చింది.

దీనికి సంబంధించి మెట్రో రైలు సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అయితే, దిశ ఘటనతో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఆపద వస్తే తమను తాము కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా పెప్పర్‌ స్ప్రే కొంటున్న ఆడవాళ్ల సంఖ్య పెరిగింది. ఈ వారంలోనే అమెజాన్‌లో పెప్పర్‌ స్ప్రే సేల్స్‌ ఏకంగా 700 రెట్లు పెరిగింది. అమ్మాయిలు దీని అవసరం తమకు ఎంతగా ఉందనుకుంటున్నారో ఇది స్పష్టం చేస్తోంది.

ఆపదలో ఉన్నప్పుడు తమను తాము రక్షించుకోవడం ఎంతమంది ఆడవాళ్లకు వచ్చు? అంటే వ‌చ్చే స‌మాధానం ప్ర‌శ్నార్థ‌క‌మే. ఈ నేప‌థ్యంలో...ఎవరైనా దాడికి ప్రయత్నించినప్పుడు వాళ్ల కళ్లలో పెప్పర్‌ స్ప్రే కొడితే… వాళ్లు కోలుకునేలోపు తప్పించుకునే అవకాశం ఉంటుంది. దిశ లాంటి ఘటనలు జరిగాయని తెలిసినప్పుడల్లా ‘పెప్పర్‌ స్ప్రే ఒకటి బ్యాగులో పెట్టుకుంటే ఆపదలో పనికొస్తుంది కదా?’ అన్న సలహాలెన్నో అమ్మాయిలకు ఇస్తుంటారు.

ఈ నేప‌థ్యంలో పెప్పర్‌ స్ప్రేలు కొంటున్న వాళ్ల సంఖ్యా బాగానే పెరిగింది. అందుకు నిదర్శనం అమెజాన్ సేల్స్. ఈ వారం రోజుల్లోనే అమెజాన్‌లో పెప్పర్‌ స్ప్రే సేల్స్‌ 700 శాతం పెరిగిందంటే… అమ్మాయిలు దీని అవసరాన్ని ఎంత ఉందనుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చున‌ని అంటున్నారు. అమెజాన్‌ ఇండియా వెబ్‌సైట్‌లో ‘సెక్యూరిటీ అండ్‌ సేఫ్టీ’ సెక్షన్ ‘పెప్పర్‌ స్ప్రే’ బెస్ట్‌ సెల్లర్‌. ఒక్కసారిగా దీనికి డిమాండ్‌ పెరగడంతో ‘కోబ్రా’ లాంటి టాప్‌ పెప్పర్‌ స్ప్రే బ్రాండ్‌ ‘అవుటాఫ్‌ స్టాక్‌’ బోర్డు పెట్టాల్సి వచ్చింది.

మ‌రోవైపు అమ్మాయిలు సెల్ఫ్‌ డిఫెన్స్‌ కోచింగ్‌ క్లాసుల్లో చేరుతున్నారు. హైద‌రాబాద్ అనే కాకుండా బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో సెల్ఫ్‌ డిఫెన్స్‌ కోచింగ్ వెళ్తున్న అమ్మాయిల, ఆడవాళ్ల సంఖ్య పెరిగింది. దిశ ఘ‌ట‌న ఓ వైపు భ‌యాన్నే కాకుండా మ‌రోవైపు జాగ్ర‌త్త‌ను సైతం పెంచింద‌ని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English