షాకింగ్: నిర్భ‌య నిందితుల‌కు ఉరి డౌటే

షాకింగ్: నిర్భ‌య నిందితుల‌కు ఉరి డౌటే

అత్యంత దారుణంగా దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఆకృత్యానికి పాల్ప‌డిన నిర్భ‌య నిందితుల‌ను ఈనెల 16వ తేదీన ఉరి తీస్తార‌ని ఊహాగానాలు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. తీహార్ జైలులో నిర్భ‌య నిందితుల‌ను ఉరి తీసేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నట్లు వార్త‌లు వ్యాపిస్తున్నాయి.

అయితే ఆ న‌లుగురికి ఉరి వేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు మీర‌ట్ జైలుకు చెందిన త‌లారి ప‌వ‌న్ గుప్తా తెలిపాడు. నిర్భ‌య అత్యాచార కేసులో న‌లుగురికి ఉరిశిక్ష ఖ‌రారైంది. ఆ నిందితుల‌కు మ‌ర‌ణ‌శిక్షే స‌రైంద‌ని త‌లారి ప‌వ‌న్ చెప్పాడు. అయితే, వారికి త‌క్ష‌ణ‌మే ఉరి ప‌డే అవ‌కాశం లేదంటున్నారు.

నిర్భ‌య దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ త‌నకు విధించిన మరణ శిక్షపై రివ్యూ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయ‌గా...దీనిపై డిసెంబర్ 17న అత్యున్నత న్యాయస్థానం విచారించనుంది. త్రిసభ్య ధర్మాసనం అక్షయ్ సింగ్ పిటిషన్ పై రివ్యూ చేయనుంది. అదే రోజు సుప్రీం తన ఆదేశాలు వెలువరించే అవకాశం ఉంది.

ఒకవేళ రివ్యూ చేసేది లేదని, గత తీర్పే ఫైనల్ అని చెబితే… మరణ శిక్షకు రూట్ క్లియర్ అవుతుంది. అప్పటికే నిర్భయ దోషులకు అన్ని ఆప్షన్లు పూర్తవుతాయి. అయితే, ఈ ప్ర‌క్రియ‌లో భాగంగా దిశ‌పై దారుణ ఘ‌ట‌న జ‌రిగిన డిసెంబ‌ర్ 16నే వారిని ఉరితీసేందుకు అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయంటున్నారు.

కాగా, నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయడానికి ఢిల్లీలోని తీహార్‌ జైలు అధికారులు వేగంగా చర్యలు చేపడుతున్నారు. ఇటీవల ఉరితాళ్లను సిద్ధం చేయాలని బక్సర్‌ జైలు అధికారులను కోరిన తీహార్‌ జైలు అధికారులు.. తాజాగా ఇద్దరు తలారీలను పంపాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు యూపీ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ (జైళ్లశాఖ) అనంద్‌కుమార్‌కు ఈ నెల 9న ఓ లేఖ రాశారు.

అవసరాన్ని బట్టి సమాచారం తెలియజేయగానే ఇద్దరు తలారీలను పంపాలని ఆ లేఖలో కోరారు. అయితే ఉరిశిక్ష ఎవరికి అమలు చేయనున్నామన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించకపోయినప్పటికీ.. ఉరిశిక్ష పడిన కొంతమంది దోషులు జైలులో ఉన్నారని, దీన్ని తప్పించుకోవడానికి వారికి న్యాయపరంగా, రాజ్యాంగపరంగా ఉన్న అవకాశాలన్నీ మూసుకుపోయాయని పేర్కొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English