పవన్ ను కెలికి విజయమ్మ ఓటమిని గుర్తు చేశారే రోజా?

పవన్ ను కెలికి విజయమ్మ ఓటమిని గుర్తు చేశారే రోజా?

అందుకే అంటారు మాట తీస్తే మాట అని. ఒకరిని అనే ముందు మనల్ని కూడా అనేస్తారన్న విషయాన్ని మర్చిపోతే ఇలాంటి తిప్పలే తప్పవన్నది మర్చిపోకూడదు. మూడు.. నాలుగు రోజుల క్రితం ఏపీ అసెంబ్లీలో మాట్లాడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా.. జనసేన అధినేత పవన్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినేతగా ఉంటూ రెండు చోట్ల పోటీ చేసిన ఓడిన ఘనత పవన్ దేనని ఆమె వ్యాఖ్యానించిన వైనాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

అసలు సభలో లేని వ్యక్తి గురించి ఎలా మాట్లాడతారన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు. ఇదే ప్రశ్నను వేసి.. సభాపతి తమ్మినేని ఆమెను అడ్డుకోవటం.. ఆ పార్టీ ఎమ్మెల్యే ద్వారా ఆయనకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నట్లుగా రోజా చెప్పినా.. ఆ మాటలు అతకలేదు. ఇదిలా ఉంటే.. రోజా మాటల్ని పలువురు తప్పు పడుతున్నారు.

అనవసరంగా పవన్ ఓటమిని ప్రస్తావించి ఆమె తప్పు చేశారంటున్నారు.  పార్టీ అధినేతగా ఉండి పవన్ ఓటమిని వేలెత్తి చూపిస్తే సరిపోదని.. దాన్ని ఎటకారం చేసుకుంటే.. 2014 ఎన్నికల్లో తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సైతం విశాఖలో ఓడిన సంగతిని మర్చిపోకూడదంటున్నారు. 151 సీట్లు వచ్చాయని గొప్పగా చెప్పుకోవటం వినేందుకు బాగానే ఉన్నా.. లాజిక్ గా చూసినప్పుడు ఇంతటి దమ్మున్న పార్టీ గౌరవాధ్యక్షురాలు 2014 ఎన్నికల్లో ఓటమికి గురి కావటం.. అది కూడా పెద్దగా పేరు లేని నేత చేతిలో కావటాన్ని మర్చిపోకూడదంటున్నారు.

ఎవరు అవునన్నా కాదన్నప్పటికీ తాను పోటీ చేసిన రెండు అసెంబ్లీ స్థానాల్లో ఓటర్లకు పవన్ కల్యాణ్ పది పైసలు కూడా పంచలేదన్నది మర్చిపోకూడదని..  ఆ మాటకు వస్తే విశాఖ ఎంపీగా పోటీ చేసిన విజయమ్మ గెలుపు కోసం జగన్ ఎంత ఖర్చు పెట్టారో మర్చిపోకూడదంటూ గతాన్ని గుర్తు చేస్తున్నారు. అసలీ చర్చకు కారణం రోజా అని.. అవసరం లేని చోట పవన్ గురించి మాట్లాడి పార్టీకి ఇబ్బంది కలిగించే అంశాలు చర్చకు వచ్చేలా చేశారంటూ పలువురు మండిపడటం గమనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English