దిశ తన తల్లిదండ్రులతో సఖ్యతగా లేదేమో..

దిశ తన తల్లిదండ్రులతో సఖ్యతగా లేదేమో..

వెట‌ర్న‌రీ వైద్యురాలు దిశ హ‌త్యోదంతం దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. గతనెల 27న దిశను నలుగురు నిందితులు కిడ్నాప్ చేయడం, ఆమెపై లైంగికదాడికి పాల్పడి, హత్యచేయడంతోపాటు, మృతదేహం కాల్చివేత అనేక మందిని క‌ల‌చివేసింది. మ‌రోవైపు  దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్చార్సీ) తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో నాలుగోరోజుల పాటు విచార‌ణ చేసింది.

ఎన్‌కౌంటర్ మృతుల కుటుంబసభ్యులు, దిశ తండ్రి, సోదరి, మృతదేహాలకు పంచనామా నిర్వహించిన నలుగురు త‌హ‌శీల్దార్లు, క్లూస్‌టీం సభ్యులను విడివిడిగా విచారించి వివరాలు సేకరించింది. ఇలా కేసు వేగంగా మలుపులు తిరుగుతున్న త‌రుణంలో...టీఆర్ఎస్ నేత ఒక‌రు క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు. దిశ‌కు, ఆమె కుటుంబ స‌భ్యుల‌కు స‌రైన సంబంధాలు లేన‌ట్లుంద‌ని వ్యాఖ్యానించారు.

కామారెడ్డి జెడ్పీ చైర్మన్ శోభ నలుగురు దుర్మార్గుల చేతిలో అత్యాచారానికి గురై, ఆ తర్వాత పాశవికంగా పెట్రోల్ పోసి చంపబడ్డ దిశ ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన మహిళా శిశు సంక్షేమ సంఘ సమావేశంలో ఆమె మాట్లాడుతూ...దిశ తన తల్లిదండ్రులతో సఖ్యతగా లేదేమో అనిపిస్తుందని ఆమె అన్నారు.

గెజిటెడ్ అధికారిగా ఉన్న దిశకు ఎవరికి ఫోన్ చేయాలో కూడా తెలియదా అని ఆమె ప్రశ్నించారు. నిందితులు అడ్డుకున్నప్పుడు తల్లిదండ్రులకు చెప్పే దైర్యం లేక దిశ తన చెల్లెలికి ఫోన్ చేసిందని ఆమె అన్నారు. చెల్లెలికి కాకుండా తండ్రికి ఫోన్ చేసి ఉంటే ఆయన వచ్చి తీసుకువెళ్లేవారు కదా అని ఆమె ఎదురు ప్ర‌శ్నించారు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ప్రభుత్వం మాత్రం ఎంతమందిని రక్షిస్తుందని ఆమె ప్ర‌శ్నించారు.

మ‌రోవైపు దిశ ఘటనపై కామారెడ్డి జెడ్పీ చైర్మన్ శోభ ఆస‌క్తిక‌ర రీతిలో స్పందించారు. ఇప్పటికైనా దిశ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆమె అధికారుల‌కు సూచించారు. అవగాహన కార్యక్రమాల వల్ల ఒక్కరు మారిన చాలని ఆమె అన్నారు. కాగా, దిశ ఘటనపై టీఆర్ఎస్ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English