చంద్ర‌బాబు వద్దు.. పవన్ ముద్దు

చంద్ర‌బాబు వద్దు.. పవన్ ముద్దు

బీజేపీతో జ‌న‌సేన‌, టీడీపీ రెండు పార్టీలు క‌లిసిపోయేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. టీడీపీ పొత్తుకు ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా..జ‌న‌సేన అయితే విలీనం అవుతోంద‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఇందుకు ఊత‌మిస్తున్నాయ‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఢిల్లీ వెళ్లివ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న స్వ‌రం పూర్తిగా మారిపోవ‌డం విశేషం. బీజేపీకి తానెప్పుడూ దూరంగా లేన‌ని, అమిత్‌షా, ప్ర‌ధాని మోదీ అంటే త‌న‌కెంతో గౌర‌వాభిమానాలున్నాయ‌ని పేర్కొన‌డం స‌గ‌టు రాజ‌కీయ నాయ‌కుల‌నే కాదు..సామాన్య జ‌నాన్ని కూడా ఆలోచ‌న‌లో ప‌డేసింది.

ప‌వ‌న్ అమిత్ షాను ఆకాశానికి ఎత్తేయ‌డంతో ప‌వ‌న్ వీరాభిమానులు సైతం అవాక్క‌వుతున్నారు. ప‌వ‌న్ ఇలా బీజేపీకి ద‌గ్గ‌ర‌వుతుండ‌గా...టీడీపీ అధినేత చంద్ర‌బాబు బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యేందుకు త‌న‌కున్న అన్నిదారుల‌ను అన్వేషిస్తున్నార‌ట‌. అయితే బీజేపీ అధిష్ఠానం మాత్రం బాబును దూరం పెట్టాల‌నే ఉద్దేశంతోనే..ఎలాంటి అనుకూల సంకేతాలు ఇవ్వ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతోందంట‌. ఇటీవల రాష్ట్ర స‌మ‌స్య‌లు విన్న‌వించేందుకు అంటూ అమిత్‌షా, ప్ర‌ధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసం కూడా చంద్ర‌బాబు ప్ర‌య‌త్నం చేసి భంగ‌ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది.

అయితే చంద్ర‌బాబు మాత్రం ప‌ట్టువిడ‌వ‌ని విక్ర‌మార్కుడిలా బీజేపీతో స‌త్సంబంధాల‌ను మెరుగుప‌ర్చేందుకు త‌న‌కు తెలిసిన వారంద‌రి చేత ప్రేమ సందేశాలు అమిత్‌షా, మోదీల‌కు పంపుతున్నార‌ట‌. ఇప్పుడు బీజేపీతో జ‌త క‌ట్టేది టీడీపీనా..?! జ‌న‌సేనా అంటూ ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. త్వ‌ర‌లో స్థానిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో  పొత్తుల అంశంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెలకొంది. పొత్తుల అంశం ఏపీ రాజ‌కీయాల్లో ఇప్పుడు కాక పుట్టిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో  సత్సంబంధాలు అవసరమనే రీతిలో వైసీపీతో స‌హ అన్ని పార్టీలు భావిస్తుండ‌టం గ‌మ‌నార్హం.  

కేంద్రం మ‌ద్ద‌తు త‌మ‌కు ఉంద‌ని వైసీపీకి అర్థ‌మయ్యేలా చేసేందుకే చంద్ర‌బాబు బీజేపీతో పొత్తుకు య‌త్నిస్తున్న‌ట్లు విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. అదే స‌మ‌యంలో ఎన్డీఏలో చేరిపోతే  కేంద్రం అండ ల‌భిస్తుంద‌ని అది పార్టీకి, రాష్ట్రానికి లాభిస్తుంద‌ని  వైసీపీ భావిస్తోందట‌. ఇక రాజ‌కీయంగా మ‌నుగ‌డ ఉండాలంటే బీజేపీతో పొత్తు  త‌ప్ప‌నిస‌రి అనే ఆలోచ‌న‌కు  ప‌వ‌న్ వ‌చ్చేశార‌ట‌. మ‌రి ఫైన‌ల్‌గా ప్ర‌తిసారి పొత్తుల‌తో ఏపీలో దెబ్బ‌తినే బీజేపీ ఈ సారి ఏ రూట్లో వెళుతుందో ?  చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English