ప్రతిపక్ష పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా - చంద్రబాబు

ప్రతిపక్ష పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా - చంద్రబాబు

మీరు సరిగ్గా చదివారు. స్వయంగా ఏపీప్రతిపక్ష నేత చంద్రబాబు నిండు అసెంబ్లీలో తాను ఎమ్మెల్యే పదవికి, ప్రతిపక్ష హోదాకు రాజీనామా చేస్తాను అని స్వయంగా ప్రకటించారు. ఆయన ఈ సవాల్ చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. నిన్నటి నుంచి అసెంబ్లీలో ఉల్లిపై రగడ జరుగుతోంది. ఈరోజు స్పీకర్ ఉల్లిపై చర్చకు అనుమతించారు.

నిన్న జరిగిన సమావేశంలో చంద్రబాబుకు చెందిన కంపెనీ హెరిటేజ్ ఫ్రెష్ లో ఉల్లి కిలో 200 అమ్ముతున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే... హెరిటేజ్ ఫ్రెష్ మాది కాదు, అది కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ కొనేసి చాలా కాలం అయ్యింది. ఆ కంపెనీతి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చంద్రబాబు ప్రకటించారు.

అయితే, తాజాగా జగన్ మరోసారి హెరిటేజ్ ఫ్రెష్ లో కిలో 200 రూపాయలు ఉల్లి అమ్ముతున్నారని మాట్లాడారు. మరి నిన్న స్వయంగా చంద్రబాబు చెప్పినా అదే పాత ఆరోపణను ఈరోజు జగన్ మళ్లీ చేయడం వెనుక ఆయన ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు.

అయితే, దీనిపై ఆగ్రహించిన చంద్రబాబు జగన్ కు సవాల్ విసిరారు. మీరు హెరిటేజ్ ఫ్రెష్ నాది అని ప్రూవ్ చేయండి నేను నా పదవులకు రాజీనామా చేస్తాను. ప్రూవ్ చేయలేకపోతే మీరు రాజీనామా చేస్తారా? అని చంద్రబాబు సవాల్ విసిరారు. నిన్న సభలో వారి ఆరోపణను ఖండించి వాస్తవం ఏంటో వివరించాక కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం దారుణం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అయితే, కొడాలి నాని ఈ విషయాన్ని డైవర్ట్ చేస్తూ... ఉల్లి గొడవలో మరణించిన సాంబయ్య విషయంపై చర్చను మళ్లించారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English