సజ్జనార్ కు ఎన్ కౌంటర్ చిక్కులు మొదలయ్యాయా?

సజ్జనార్ కు ఎన్ కౌంటర్ చిక్కులు మొదలయ్యాయా?

దిశ నిందితుల ఎన్ కౌంటర్ లో ఎక్కువగా ఫోకస్ అయ్యింది సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్. ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా ఆయనకు పేరుందని.. ఆయన ఫాస్ట్ ట్రాక్ రికార్డు చూస్తే ఈ విషయం అర్థమవుతుందంటూ పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. మంచి అధికారిగా పేరుతో పాటు.. తన కింది సిబ్బంది విషయంలో ఎంతో బాగుంటారన్న పేరుంది. అలాంటి ఆయనకు టాస్క్ ఇవ్వాలే కానీ దాని సంగతి చూసే వరకూ వదిలిపెట్టరన్న పేరుంది.

దిశ నిందితుల ఎన్ కౌంటర్ విషయం బయటకు వచ్చినంతనే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ భావోద్వేగంతో స్పందించారు. తెలంగాణ పోలీసులకు జయహో అంటూ కీర్తించారు. ప్రశంసలతో ముంచెత్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎన్ కౌంటర్ తర్వాత నుంచి జాతీయ మానవ హక్కుల కమిషన్ మొదలు.. మేధావి వర్గంగా చెప్పుకునే పలువురు ఎన్ కౌంటర్ పై విమర్శలు సంధించటం షురూ చేశారు.

తాజాగా హైదరాబాద్ నగరానికి చెందిన నేను సైతం అనే ఎన్జీవో ఒకటి ఉప్పల్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దిశ హత్యాచారం కేసులో నిందితులైన నలుగురు యువకుల్ని ఎన్ కౌంటర్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురు నిందితుల్ని పాయింట్ బ్లాక్ రేంజ్ లోకాల్చి చంపిన వైనంపై సజ్జనార్ తో పాటు మరో నలుగురు పోలీసు అధికారులపై హత్య కేసు నమోదు చేయాలని పేర్కొనటం సంచలనంగా మారింది.
అయితే.. ఈ ఫిర్యాదుపై రాచకొండ పోలీసులు స్పందించలేదు. ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. మరీ.. వ్యవహారం సజ్జనార్ కు తలనొప్పిగా మారుతుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English